BREAKING
పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల ఠానేలంక గురుకులంలో న్యాయ విజ్ఞాన సదస్సు...విద్యార్థినులతో మేజిస్ట్రేట్ ముఖాముఖి... నేటి రాశి ఫలాలు: 11 అక్టోబర్ 2026. నేటి పంచాంగం 11 అక్టోబర్ 2026 తులిప్ స్కూల్‌లో సందడిగా పీపుల్స్ లీడర్ ఎన్నికలు.

వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల

Select Suryaa Now
వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల

కడియం, మేజర్ న్యూస్, :కడియం మండలం వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా భారీ మురుగు కాలువ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. కొండ కాలువ ఆక్రమణలకు గురైందన్న ఫిర్యాదుల నేపథ్యంలో శనివారం దేవీ జనార్ధన్ నగర్, కేవీఆర్ లేఅవుట్ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించి పరిస్థితులను పరిశీలించారు.

.కొండ కాలువ మార్గంలో మోటార్‌సైకిల్‌పై పర్యటించిన ఎమ్మెల్యే, మురుగు నీటి ప్రవాహానికి ఉన్న ఇబ్బందులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కొండ కాలువ ప్రాంతంలో గత 35 ఏళ్లుగా నివాసం ఉంటున్న 67 నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు తమ ఇళ్లను తొలగిస్తే తమ పరిస్థితి ఏమిటని ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై స్పందించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గ్రామంలో ముంపు సమస్య తలెత్తకుండా కొండ కాలువకు రీ సర్వే నిర్వహించి, భారీ మురుగు కాలువ నిర్మాణానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచే సంబంధిత అధికారులతో మాట్లాడి నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.ఈ పర్యటనలో మాజీ ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, చెల్లుబోయిన శ్రీనివాస్, సూరపురెడ్డి జానకిరామ్, కొప్పిశెట్టి నాగేశ్వరరావు, కోలా శ్రీనివాస్, అల్లంపల్లి ప్రసాద్, ఈడుపుగంటి బుజ్జి, దంగేటి శ్రవణ్ కుమార్, ద్రాక్షరపు వాసు తదితరులు పాల్గొన్నారు.