BREAKING
కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల ఠానేలంక గురుకులంలో న్యాయ విజ్ఞాన సదస్సు...విద్యార్థినులతో మేజిస్ట్రేట్ ముఖాముఖి... నేటి రాశి ఫలాలు: 11 అక్టోబర్ 2026. నేటి పంచాంగం 11 అక్టోబర్ 2026 తులిప్ స్కూల్‌లో సందడిగా పీపుల్స్ లీడర్ ఎన్నికలు. కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర

ఠానేలంక గురుకులంలో న్యాయ విజ్ఞాన సదస్సు...విద్యార్థినులతో మేజిస్ట్రేట్ ముఖాముఖి...

Select Suryaa Now
ఠానేలంక గురుకులంలో న్యాయ విజ్ఞాన సదస్సు...విద్యార్థినులతో మేజిస్ట్రేట్ ముఖాముఖి...

ముమ్మిడివరం, మేజర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఠానేలంక గురుకుల పాఠశాలలో ముమ్మిడివరం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దాసరి సత్యనారాయణ అధ్యక్షతన ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

 ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ పాఠశాల ఆవరణను క్షుణ్ణంగా పరిశీలించి, బాలికల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పాఠశాలలో ఆడుకోవడానికి ఆట స్థలం గ్రౌండ్ లేకపోవడం, హాస్టల్‌లో పడుకోవడానికి తగినన్ని బెడ్స్ మంచాలు సదుపాయం కరువవ్వడం, మరియు బాలికల రక్షణకు అత్యంత కీలకమైన హాస్టల్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవడం వంటి తీవ్రమైన సమస్యలను విద్యార్థినులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

 దీనిపై మేజిస్ట్రేట్ స్పందిస్తూ, ఈ సమస్యలన్నింటినీ తక్షణమే నివేదిక రూపంలో ప్రభుత్వం మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని, విద్యార్థినులు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధిగమించి పట్టుదలతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా, విద్యార్థినులకు అనారోగ్యం వస్తే కేవలం పీహెచ్‌సీకి తరలించడం మాత్రమే కాకుండా, వైద్య సిబ్బంది మరియు హెల్త్ అసిస్టెంట్లే స్వయంగా క్రమం తప్పకుండా హాస్టల్‌ను సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థుల ఆరోగ్య భద్రతను కాపాడాల్సిన కనీస బాధ్యత వైద్య బృందంపై ఉందని స్పష్టం చేస్తూ తగిన ఆదేశాలు జారీ చేశారు.