BREAKING
వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ!

రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు

Select Suryaa Now
 రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు

ఆత్రేయపురం మేజర్ న్యూస్  కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృషితో రావులపాలెం, వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లే ఏటిగట్టు రహదారి విస్తరణ పనులు ముందుకు వెళ్లడానికి మార్గం సుగమం అవుతుంది  ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంజూరు చేసిన రూ.6 కోట్లతో పాటుగా, పుష్కర నిధులు, ఇతరత్రా నిధులతో కలిపి రూ.8 కోట్లు ఈ రహదారి నిర్మాణానికి ఇప్పటికే మంజూరయ్యాయి.

 నానాటికి పెరుగుతున్న భక్తుల రద్దీ, వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి రూ.19 కోట్లతో రహదారి విస్తరణ చేపట్టి, అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే  బండారు సత్యానందరావు కోరారు.

 దీనితో ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ బి బాలునాయక్, సూపరింటెండెంటింగ్ ఇంజనీర్ ఎస్ఈ  పి రామకృష్ణారెడ్డి, ఈఈ సీతంనాయుడు, డీఈఈ అన్యం రాంబాబు, అధికారులు శనివారం రహదారిని పరిశీలించారు. ఏపీ ఆర్ ఆర్ ఎస్ పి నిధుల నుంచి జాతీయ రహదారి నుంచి వాడపల్లి కి ఏటిగట్టు రోడ్ మంజూరు,5.5 మీటర్ల వెడల్పున చేయడానికి క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు. అంచనాలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపనున్నట్లు వారు తెలిపారు