స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు.
ఆత్రేయపురం మేజర్ న్యూస్ రానున్న జిల్లా,మండల పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికలకు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు సమాయత్తం అవ్వాల్సిందిగా కోనసీమ జిల్లా అధ్యక్షులు చి ర్ల జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు ఆయన శనివారం మాజీ డిసిసిబి డైరెక్టర్ చిలువూరి రామకృష్ణ రాజు స్వగృహం వద్ద కన్ను ఆపరేషన్ చేసుకున్న రామకృష్ణంరాజును పరామర్శించారు అలాగే గ్రామంలో చెన్నం ముసలయ్య ను పరామర్శించారు
అనంతరం కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పాలన అందించారని అలాగే ఎస్సీ, బీసీ, ముస్లిం మైనారిటీ, కాపులు కు కూడా తన పాలనలో ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి అన్ని వర్గాల కు సమ ప్రాధాన్యతను ఇచ్చి ప్రోత్సహించినట్లు తెలిపారు వైఎస్ఆర్సిపి బలోపేతానికి నాయకులు కార్యకర్తలు ఐకమత్యంగా కృషి చేయాల్సిందిగా ఆయన కోరారు
పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కుల దృవీకరణ పత్రాలతో సిద్ధంగా ఉండాలన్నారు ఆయన వెంట వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు సఖినేటి వాకుల రాజు, ముదునూరి కృష్ణంరాజు వేగేశ్న గోపిరాజు చిలువూరి నాగరాజు , రొట్టె దావీదు, బసవయ్య, మాధవరావు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు