BREAKING
మూడు పదవుల ముచ్చటేనా.. బాధ్యతల సంగతేంటి? బొడ్డు వెంకటరమణ కు మూడు కీలక పదవు లపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన, వ్యక్తిత్వ పోటీలు తైలాభిషేకాలతో శనేశ్వరాలయం…దర్శనానికి పోటెత్తిన భక్తులుస్వా మివారికి రూ.5.16 లక్షల ఆదాయం ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల

రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి!

Select Suryaa Now
రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి!

రావులపాలెం బ్రిడ్జి నుంచి వెదిరేశ్వరం మీదుగా పలివెల బ్రిడ్జి వరకు గల సుమారు 9 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారిని బీటీ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు రూ.20 కోట్ల నిధులు మంజూరైనట్లు కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వెల్లడించారు.

జాతీయ రహదారి 216E పరిధిలోని ఈ మార్గంలో పనుల విభజన వివరాలను ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇందులో భాగంగా కిలోమీటర్ 22.730 నుంచి 27.600 వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.10 కోట్లు, అలాగే కిలోమీటర్ 27.600 నుంచి 31.710 వరకు మరో రూ.10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ మార్గంలో దెబ్బతిన్న మెటల్ రోడ్డు కారణంగా వాహనదారులు, స్థానిక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, తాజా నిధుల మంజూరుతో ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని పేర్కొన్నారు.

ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి త్వరలోనే అధికారిక టెండర్లు పిలిచి, రాబోయే మూడు నెలల వ్యవధిలోనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వివరించారు. అంతేకాకుండా, వచ్చే ఏడాది ఈ రహదారి విస్తరణతో పాటు పూర్తి స్థాయి అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు బండారు సత్యానందరావు స్పష్టం చేశారు.