BREAKING
గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ పంపిణీ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం -- ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ 38 కేజీల గంజాయి పట్టివేత ముగ్గురి అరెస్టు చోడవరం ఆది ఆంధ్ర పాఠశాలలో ప్రమాదకర పరిస్థితులు! ప్రేమలు క్రేజ్.. ఏకంగా 50 రెట్లు పెరిగిన నటి మమితా బైజు రెమ్యునరేషన్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల విషయంలో టీడీపీ కట్టుబడి ఉంది – ఇన్చార్జి పొత్తూరి రామరాజు కంటి చూపు పై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి *తిరుపతి విమానాశ్రయం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి : తిరుపతి ఎంపీ గురుమూర్తి* తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌ నాయుడుకు ఆయన లేఖ రాశారు. తి *పాలకొల్లులో ప్రపంచ తపాలా దినోత్సవ వేడుకలు.* *తపాలా సిబ్బందికి యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ఘన సత్కారం.* సిగ్మా మూవీ నుంచి 'సులోచన' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్.. కుర్రాళ్లను ఊపేస్తున్న తమన్ మ్యూజిక్ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపాని వీడి తెదేపాలో చేరిక ప్రతిష్టాత్మకమైనా... ప్రశాంతంగానే ముగిసిన ఎస్.రాయవరం హైస్కూల్ ఎన్నికలు! డిజిటల్ విధానంలో ఎరువుల విక్రయాలు – ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌పై అవగాహన కార్యక్రమం* ప్రపంచ బ్యాంకు సమావేశాలకు గైర్హాజరుకానున్న అమెరికా ఆర్థిక మంత్రి బెసెంట్ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం తెలంగాణ టూరిజానికి ఐటీ చేయూత

సిఎం రేవంత్ రెడ్డికి అలంపూర్ శ్రీ జోగుళాంబ అమ్మవారి కల్యాణోత్సవ ఆహ్వానం

Select Suryaa Now
సిఎం రేవంత్ రెడ్డికి అలంపూర్ శ్రీ జోగుళాంబ అమ్మవారి కల్యాణోత్సవ ఆహ్వానం

ఈ నెల 16న అలంపూర్ శ్రీ జోగుళాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామివారి క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ జోగుళాంబ అమ్మవారి కల్యాణోత్సవంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి గారి నివాసంలో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ ఎం. హన్మంతరావు, గద్వాల సంస్థాన వారసులు శ్రీ కృష్ణ రామభూపాల్, మరియు శ్రీ జోగుళాంబ అమ్మవారి దేవస్థానం ఈవో శ్రీమతి దీప్తి గారు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాల అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు. తెలంగాణలోని ద్వాదశ జోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్ క్షేత్రంలో జరిగే ఈ కల్యాణోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.