BREAKING
నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు రోజంతా సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో జరిగే అనర్థాలు ఇవే.. డీహైడ్రేషన్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న రియల్ స్టోరీ క్రైమ్ థ్రిల్లర్.. వీకెండ్‌లో చూసేందుకు అద్భుతమైన మూవీ కొప్పర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి - సిపిఎం వట్టిప్రోలు రంగారావు ను సత్కరించిన...... వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు షేక్ నాజర్ లీజుకు తీసుకున్న బస్సులు అమ్ముకున్నారని ఆరోపణ.. బాధితులకు న్యాయం చేయాలి అంటున్న నల్లి రాజేష్.* అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్.. కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం నటించని స్టార్ హీరోయిన్ కార్మికుల కొరత పరిష్కారానికి లావోస్ తీవ్ర కసరత్తు: స్వర్ణాంధ్ర కాలేజి ని సందర్శించిన నాక్ ఈసీ కమిటీ చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు

కంటి చూపు పై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి

Select Suryaa Now
కంటి చూపు పై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి

ఉండి, మేజర్ న్యూస్:పంచేంద్రియాల్లో కన్ను అత్యంత ముఖ్యమైనదని, ప్రతి ఒక్కరూ కంటి సంరక్షణపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లయన్స్ క్లబ్ పశ్చిమగోదావరి జిల్లా ద్వితీయ గవర్నర్ స్వరూప్ సూచించారు. శుక్రవారం ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ద్వారంపూడి నారాయణరెడ్డి సహకారంతో లయన్స్ ఆడిటోరియంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన స్వరూప్ మాట్లాడుతూ సుమారు 150 మంది వైద్య శిబిరంలో నేత్ర పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి నిడదవోలు శ్రీ రాజేశ్వరి రామకృష్ణన్ లయన్ కంటి ఆసుపత్రి సహకారంతో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే కళ్లద్దాలు అవసరమైన వారికి వాటిని అందించినట్లు వివరించారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ద్వారంపూడి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఇటీవల ఆరేడు గ్రామంలో నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించామని, అదే స్ఫూర్తితో ఉండిలోనూ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరుపేదలకు సేవలందించడంలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని, ఈ సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం నిరంతరం అందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి ఆర్ నరసరాజు, కోశాధికారి కన్నెగంటి రూత్ కళ, సభ్యులు సత్తి బ్రహ్మారెడ్డి, గాదిరాజు రంగరాజు, బొండాడ కేశవరావు, నంబూరి కాశీ విశ్వేశ్వరరావు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, రంగప్రసాద్ రాజు, కాగిత మహంకాళి, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ రాజు ఉండి పశ్చిమగోదావరి జిల్లా