బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల విషయంలో టీడీపీ కట్టుబడి ఉంది – ఇన్చార్జి పొత్తూరి రామరాజు
నరసాపురం, మేజర్ న్యూస్ :నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ పొత్తూరి రామరాజు అధ్యక్షతన రాష్ట్ర మత్స్యకారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొప్పాడ రవీంద్రనాథ్ ఠాగూర్‌తో కలిసి బీసీ నాయకులు శుక్రవారంసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు, వారి రాజకీయ ప్రాతినిధ్యం, వైసీపీ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయం తదితర అంశాలపై నాయకులు మాట్లాడారు.బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. చట్టపరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ, పార్టీ పరంగా బీసీలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి న్యాయం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, వారి రాజకీయ, సామాజిక అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.బీసీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని, 1987లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 20 శాతం, 1995లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందని తెలిపారు. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించి, వారు ప్రజాప్రతినిధులుగా ఎదిగేందుకు మార్గం సుగమం చేయడం తెలుగుదేశం పార్టీ విధానమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వాతాడి ఉమామహేశ్వరరావు, గుబ్బల నాగరాజు, పొన్నాల నాగబాబు, తిరుమాని శశిదేవి, తిరుమాని గొవిందరాజు, దొంగ పద్మారావు, కొప్పాడి సత్యనారాయణ, నాగిడి రాంబాబు, మావూరి ఆనంద్ కుమార్, ముంగడ శివ, నాట్ర నరేష్, కొప్పినేని శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా