BREAKING
లీజుకు తీసుకున్న బస్సులు అమ్ముకున్నారని ఆరోపణ.. బాధితులకు న్యాయం చేయాలి అంటున్న నల్లి రాజేష్.* అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్.. కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం నటించని స్టార్ హీరోయిన్ కార్మికుల కొరత పరిష్కారానికి లావోస్ తీవ్ర కసరత్తు: స్వర్ణాంధ్ర కాలేజి ని సందర్శించిన నాక్ ఈసీ కమిటీ చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి.. ఏమన్నారంటే? ఉత్తర కొరియా ముప్పుపై దక్షిణ కొరియా, జపాన్ రక్షణ శాఖల కీలక భేటీ: రూ.248 కోట్లతో నర్సీపట్నం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి! రూ.3 కోట్లతో వాకింగ్ ట్రాక్, కళ్యాణ మండపం పనులకు శ్రీకారం : స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇథియోపియా నేషనల్ ప్యాలెస్, మ్యూజియంను సందర్శించిన విదేశాంగ మంత్రి జైశంకర్ బీసీలకు టీడీపీ అండగా ఉంటుంది బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడు గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ బాలిక దినోత్సవం శీనయ్యకు..జిల్లా పెద్ద బాధ్యతలు..! కోట్యాడ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయుడు రంభ వెంకట రమణకు సన్మానం ఉపాధి పనులు వేగవంతం చేయాలి ప్రజాదర్బార్‌కు విశేష స్పందన.. స్వీకరించిన ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి -- జెసి కె.ఆర్. కల్పశ్రీ, విప్ నాయకర్

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ

Select Suryaa Now
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ

 

ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆటపాటల సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతుందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు అన్నారు. ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలను అందంగా పేర్చి బతుకమ్మగా పూజించడం తెలంగాణ ప్రత్యేకత అని పేర్కొన్నారు.

బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంలో అంతర్భాగమని, ఆడబిడ్డలు కుటుంబ సభ్యులు, ఆడపడుచులతో కలిసి తొమ్మిది రోజులపాటు ఆటపాటలతో ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను జరుపుకోవడం మన సంస్కృతిలోని గొప్పతనాన్ని చాటుతుందని తెలిపారు.

ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ పండుగ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఐక్యతను, సంతోషాన్ని నింపుతుందని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజించే ఈ పండుగ తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.