గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ బాలిక దినోత్సవం
నర్సాపురం రూరల్, మేజర్ న్యూస్:అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని, బాలికల హక్కులు, విద్య, ఆరోగ్యం, భద్రత సాధికారతపై విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు మండలంలోని లక్ష్మనేశ్వరంలో గల మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల (బాలికలు) నందు అవగాహన నిర్వహించారు.శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలోబాలికలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు 1098 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమస్యను తెలియజేయాలని, బాలికలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించి, వారు విద్యా, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని, లింగ విపక్షత నుండి బాలికలు కాపాడలని, బాలికలు అన్ని రంగాలలో పోటీ పడాలని ఐసిడిఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ డి. లక్ష్మి తెలిపారు.బాలికలకు సమాన హక్కులు, విద్యావకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాలికల పట్ల వివక్షను రూపుమాపాలని, బాల్యవివాహాలను అరికట్టాలని, బాలికలపై జరిగే హింసను నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.14 సంవత్సరల లోపు పిల్లలందరకు జీవించే హక్కు, చదువుకునే హక్కు వంటి ప్రత్యేక హక్కుల గురించి జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్. రాజేష్ తెలి పారు.ప్రస్తుత సమాజంలో బాలికలపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా పడుతుందని డిజిటల్ మాధ్యమాల ద్వారా వారు అనేక నష్టాలకు గురి అవుతున్నారని కావున చదువుకునే బాలికలందరూ సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని జిల్లా క్రాఫ్ట్ కోఆర్డినేటర్ ఆర్ శ్రీనివాస్ అన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ మౌనిక సిడిపిఓ ఉమా అంగన్వాడి సూపర్వైజర్లు ఎం పద్మావతి, ఈ కనకమహాలక్ష్మి, సిహెచ్ దుర్గాభవాని తదితరులుపాల్గొన్నారు.
రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా