BREAKING
ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు!

లీజుకు తీసుకున్న బస్సులు అమ్ముకున్నారని ఆరోపణ.. బాధితులకు న్యాయం చేయాలి అంటున్న నల్లి రాజేష్.*

Select Suryaa Now
 లీజుకు తీసుకున్న బస్సులు అమ్ముకున్నారని ఆరోపణ.. బాధితులకు న్యాయం చేయాలి అంటున్న నల్లి రాజేష్.*

పాలకొల్లు మేజర్ న్యూస్ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని వికాస్ జూనియర్ కళాశాల యాజమాన్యం లీజుకు తీసుకున్న ఐదు స్కూల్ బస్సులను అమ్ముకుని, తమకు రావాల్సిన బకాయిలు చెల్లించలేదని బస్సుల యజమానులు ఆరోపించారని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.పాలకొల్లులోని గాంధీ బొమ్మల సెంటర్‌లో శుక్రవారం మాలమహానాడు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బాధితులకు రూ.39 లక్షల పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు బాధితులు తీవ్ర మనోవేదనకు గురై ఈ నెల 5న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, ప్రస్తుతం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వికాస్ కళాశాల యాజమాన్యంపై చట్టప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని నల్లి రాజేష్ డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమలో మాలమహానాడు జిల్లా అధ్యక్షులు గుండె నగేష్ , జిల్లా కార్యదర్శులు మర్రె శామ్యూల్ , పోనుకుమట్ల వీరాస్వామి , విపర్తి నవీన్ , నక్కా నాగేశ్వరరావు  , నరసాపురం డివిజన్ మహిళాధ్యక్షరాలు చిలకపాటి మేరిరత్నం , పాలకొల్లు పట్టణ అధ్యక్షులు పెనుమాల బోసుబాబు ,  పాలకొల్లు మండల అధ్యక్షులు గుమ్మాపు రవిబాబు ,  ఆచంట నియోజకవర్గ కార్యదర్శి కొండేటి వెంకన్న బాబు ,  యలమంచిలి మండల అధ్యక్షులు బుంగా జయరాజు , పాలకొల్లు మండల యువజన అధ్యక్షులు మందపాటి జోసెప్ , సబ్బితి పద్మారావు , ఏలూరి రాజ్ కమల్ , బందెల పృద్వీ , కుంచె మధు , కుంచె శ్రీనివాసరావు ,  మంగం రామయ్య , దిడ్ల  సందీప్ , పిల్లి శేఖర్ బాబు ,  మండ్రు సుధా , పెనుమాల రాకేశ్ , నల్లి సూరి , బొండా ప్రసాద్ , అధంకి మరియు భాధితుల బంధువులు పాల్గొన్నారు

 నరసింహారావు పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లా