BREAKING
ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల ఠానేలంక గురుకులంలో న్యాయ విజ్ఞాన సదస్సు...విద్యార్థినులతో మేజిస్ట్రేట్ ముఖాముఖి... నేటి రాశి ఫలాలు: 11 అక్టోబర్ 2026. నేటి పంచాంగం 11 అక్టోబర్ 2026

ప్రజాదర్బార్‌కు విశేష స్పందన..

Select Suryaa Now
ప్రజాదర్బార్‌కు విశేష స్పందన..

గజపతినగరం సూర్య: ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం, వారి సమస్యలను నేరుగా తెలుసుకొని సత్వర పరిష్కారం చూపించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో భాగంగా గజపతినగరం నియోజకవర్గం, గజపతినగరం మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్‌ - ప్రజాదర్బార్‌)కు విశేష స్పందన లభించింది. రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజల నుంచి వినతులను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు రెవెన్యూ, భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కొరత తదితర అంశాలపై వినతులు సమర్పించారు. ప్రతి అర్జీని పరిశీలించిన మంత్రి, సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి, అర్హతలు, నిబంధనల మేరకు న్యాయవంతంగా పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పదేపదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా బాధ్యతాయుతంగా సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.