స్వీకరించిన ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి -- జెసి కె.ఆర్. కల్పశ్రీ, విప్ నాయకర్
నర్సాపురం,మేజర్ న్యూస్ :ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, సంబంధిత అధికారులను ఆదేశించారు.నరసాపురం నియోజకవర్గంలో ఒక నెల నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో 3 విడత ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్.కల్పశ్రీ, స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ కలసి, భూ సమస్యలు, ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, పారిశుధ్యం, మత్స్య శాఖ, తదితర ఇతర అంశాలపై 69 ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్ప శ్రీ మాట్లాడుతూపి జి ఆర్ ఎస్ ,రెవెన్యూ క్లినిక్ లు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల అమలుపై స్వీకరించిన ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు.ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ సమస్యలు,భూ వివాదాలు, భూ రికార్డుల సవరణలు, ఇతర రెవెన్యూ అంశాలపై నిర్వహించే రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అర్జీదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిశీలించాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి తావివ్వకుండా ప్రతి అర్జీ పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సమస్య పరిష్కారానికి అవకాశం ఉన్న అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించి, తీసుకున్న చర్యలను అర్జీదారులకు స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. పరిష్కరించి నట్లు నమోదు చేయడమే కాకుండా సమస్య పరిష్కారమైందా లేదా అనే అంశాన్ని కూడా అధికారులు నిర్ధారించు కోవాలని అన్నారు.ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, ప్రజలకు మెరుగైన సేవలును అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ అధికారులు ఆదేశించారు.స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 3 విడతలగా పి జి ఆర్ ఎస్ లో అందిన ప్రతి అర్జీ నీ క్షుణ్ణంగా పరిశీలించి సమస్య స్వభావాన్ని అర్థం చేసుకుని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు బాధ్యతాగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్ ఎఫ్ డి బి) వారు ,పశ్చిమగోదావరి జిల్లా కోస్తాకు సంబంధించిన బ్రా క్రిష్ వాటర్ ఏరీయాను ఆక్వా క్లస్టర్ గా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని నరసాపురం నియోజకవర్గ తీర ప్రాంతం, ఆక్వా రైతుల సంఘం అధ్యక్షులు కటకం శెట్టి మాణిక్యాలరావు తదితరులు కోరారు. నరసాపురం పట్టణం 3 వ వార్డు ప్రజలు, జానకి హాస్పటల్ వెనుక వీధి కొద్దిపాటి వర్షానికి రోడ్డు మునిగి, నడిచి వెళ్లే వారికి ద్విచక్ర వాహనములు వెళ్ళుటకు చాలా ఇబ్బందికరంగా ఉంది రోడ్డు ఎత్తు పెంచాలని కోరారు.నరసాపురం మండలం నవరసపురం గ్రామంలో ఆర్ఎస్ నెంబర్ 190/1,190/7 లో నా భూమి ఆన్లైన్ యందు వేరే వారి ఆధార్ నెంబరు లో చూపిస్తున్నది,పరిశీలించి నా పేరున ఉన్న ఆధార్ నెంబర్ కి సరిచేయాలని యలమంచిలి మండలం చించినాడ గ్రామం నుండి రుద్రరాజు సీతాకుమారి కోరారు.మొగల్తూరు మండలం సేరేపాలెం గ్రామం నుండి కత్తులు వెంకట నరసమ్మ వృద్ధాప్యంలో ఉన్న తనను మోసము చేసి తన పేరును ఉన్న ఆస్తి కుమారులు పేరున రాయించుకుని బయటకు గెంటివేసారని న్యాయం జరిగేలా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ దాసిరాజు, పి జి ఆర్ ఎస్ నోడల్ అధికారి వై. దోసిరెడ్డి, స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అధికారి వెంకటలక్ష్మి, డి ఎల్ డి ఓ ఎం శ్యామల,మున్సిపల్ కమిషనర్ ఆర్.వెంకట్రామిరెడ్డి,నరసాపురం మొగల్తూరు తాహసిల్దార్లు నాగార్జున, ఫరూక్, ఎంపీడీవో లు ఎం ఎన్ రెడ్డి, త్రిశూల పాణి, యం నాసరు రెడ్డి,మత్స్య శాఖ కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పోత్తూరీ రామరాజు,వివిధ శాఖల జిల్లా , డివిజన్ ,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇజ్రాయిల్ నరసాపురం రిపోర్టర్ పశ్చిమగోదావరి జిల్లా