19వ వార్డులో విద్యార్థులకు నూతన వస్త్రాల పంపిణీ
19వ వార్డులో విద్యార్థులకు నూతన వస్త్రాల పంపిణీ
అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో ప్రభుత్వ పథకంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మున్సిపల్ చైర్‌పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఆదేశాల మేరకు 19వ వార్డు కౌన్సిలర్ జినుగు రవి ఆధ్వర్యంలో విద్యార్థులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.
విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్న పథకాలను అర్హులైన విద్యార్థులకు చేరవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ, వారి విద్యాభివృద్ధికి తోడ్పడేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ తిరుమల శెట్టి వెంకన్న బాబు, మండల కాంగ్రెస్ నాయకులు అల్లాడి రామారావు, కర్నాటి శ్రీనివాసరావు, పాఠశాల సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి మునీర్ అశ్వరావుపేట