38 కేజీల గంజాయి పట్టివేత ముగ్గురి అరెస్టు
డుంబ్రిగుడ:, అక్టోబర్ 9, మేజర్ న్యూస్ : ఒడిశా నుంచి ఆంధ్ర మీదుగా మైదాన ప్రాంతానికి తరలించే గంజాయిని పట్టుకోవడం జరిగిందని అరకు సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఈ
సందర్భంగా ఆయన విలేకరులకు తెలిపిన వివరాలు ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో స్థానిక ఎస్సై సురేష్ నేతృత్వాన గురువారం సాయంత్రం గంటసీమ ప్రధాన రోడ్డులోని కస్తుర్బా గాంధీ గురుకుల బాలికల పాఠశాల సమీపంలో వాహనాలు తనిఖీలను చేపట్టారన్నారు. ఒడిశా నుంచి ఆంధ్ర మీదుగా వస్తున్న ఆటోలో నలుగురు ప్రయాణిస్తుండగా తనిఖీ చేపట్టడం జరిగిందన్నారు. ఆటోలో తరలిస్తున్న 6ప్యాకెట్లతో 38 కేజీల గంజాయి పట్టుబడిందన్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురుని అదుపులో తీసుకోవడం జరిగిందన్నారు. స్థానిక రెవెన్యూ, పోలీసు సమక్షంలో పంచనామ నిర్వహించారని చెప్పారు. గంజాయి తరలిస్తున్న వారిలో పాడేరు మండలం కించూరు పంచాయతీ ఒంటివీధుల గ్రామానికి చెందిన కిల్లో ద్రోహణరావు, కిల్లో రాంబాబు, కిల్లో శ్రీను అనే నిందితులపై కేసును నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి రిమాండ్కు తరలించామని అన్నారు. పట్టుబడిన నిందితుల్లో మైనరు బాలుడిని జువైనల్ హోంకు తరలించామని, ఒడిశా రాష్ట్రానికి చెందిన మరోకరు పరారీలో ఉన్నారని, త్వరలోనే ఆయనను అరెస్టు చేస్తామని ఆయన పేర్కొన్నారు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.