BREAKING
ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు!

కొప్పర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి - సిపిఎం

Select Suryaa Now
కొప్పర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి - సిపిఎం

నరసాపురం రూరల్, మేజర్ న్యూస్:మండలంలోనికొప్పర్రు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు శుక్రవారం కొప్పర్రు సెంటర్‌లో నిరసన కార్యక్రమం చేశారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు మాట్లాడుతూ కొప్పర్రు గ్రామాన్ని ఆనుకొని సుమారు 35 వేల జనాభా కలిగిన 9 గ్రామాల ప్రజలు ప్రభుత్వ వైద్య సేవల కోసం 10 కిలోమీటర్ల దూరం వెళ్లవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పది వేల జనాభాకు ఒక ఆసుపత్రి అవసరం ఉందని, అయితే 35 వేల జనాభా గల ప్రాంతంలో కనీసం ప్రాథమిక వైద్య కేంద్రం లేకపోవడం దారుణమని విమర్శించారు.ప్రభుత్వ వైద్య కేంద్రం అందుబాటులో లేకపోవడం వల్ల ప్రధానంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుందని అన్నారు.కొప్పర్రు, సమీప గ్రామాల్లో అత్యధిక మంది దళితులు, బలహీన వర్గాల నిరుపేద ప్రజలు నివాసం ఉంటున్నారని, వీరికి వైద్య సేవలు అందుబాటులోకి తేవడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. తక్షణం కొప్పర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జల్లి రామ్మోహన్ రావు, పిల్లి కామేశ్వరరావు, పోలిశెట్టి పేరంటాల నాయుడు, చినమిల్లి వీరబాబు, పోలిశెట్టి సత్తిబాబు, కోర బుల్లయ్య, తామరాడ పార్వతీశం, మోపిదేవి శేషయ్య, వర్దనపు జయరాజు తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్ట్ ఇజ్రాయిల్  నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా