BREAKING
హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు రోజంతా సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో జరిగే అనర్థాలు ఇవే.. డీహైడ్రేషన్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న రియల్ స్టోరీ క్రైమ్ థ్రిల్లర్.. వీకెండ్‌లో చూసేందుకు అద్భుతమైన మూవీ కొప్పర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి - సిపిఎం వట్టిప్రోలు రంగారావు ను సత్కరించిన...... వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు షేక్ నాజర్ లీజుకు తీసుకున్న బస్సులు అమ్ముకున్నారని ఆరోపణ.. బాధితులకు న్యాయం చేయాలి అంటున్న నల్లి రాజేష్.* అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్.. కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం నటించని స్టార్ హీరోయిన్

చోడవరం ఆది ఆంధ్ర పాఠశాలలో ప్రమాదకర పరిస్థితులు!

Select Suryaa Now
చోడవరం ఆది ఆంధ్ర పాఠశాలలో ప్రమాదకర పరిస్థితులు!

 

ఆరు నెలలుగా విద్యార్థులపై వీధి కుక్కల దాడులు?
అసంపూర్తి ప్రహరీతో పాముల సంచారం.. విద్యార్థుల భద్రత గాలికి!
ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

చోడవరం, మేజర్ న్యూస్ : చోడవరం చిన్నబజార్‌లోని మండల పరిషత్ ఆది ఆంధ్ర ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల ఆవరణలో ప్రహరీ గోడ అసంపూర్తిగా ఉండటం, మరోవైపు వీధి కుక్కలు, పాముల సంచారం కారణంగా విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత ఆరు నెలలుగా పాఠశాల పరిసరాల్లో వీధి కుక్కలు విద్యార్థులపై దాడి చేస్తున్నాయని, ఇటీవల ఓ బాలికను కుక్క కరిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాల ప్రాంగణానికి తూర్పు వైపు ప్రహరీ గోడ పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల కుక్కలు లోపలికి ప్రవేశిస్తున్నాయని చెబుతున్నారు. విద్యార్థులు ఆటలాడుకునే ప్రదేశంలో పాములు సంచరిస్తున్నాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. పాఠశాలకు వెళ్లే దారిలో అపరిశుభ్రత నెలకొనడంతో చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. 2025లో బాధ్యతలు చేపట్టిన ప్రధానోపాధ్యాయులు సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులను కుక్కలు కరిచిన ఘటనలపై మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారా లేదా అన్న అంశంపై స్పష్టత లేదని తెలుస్తోంది. ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ)ను సంప్రదించగా, తొలుత పాఠశాలలో కుక్కల దాడుల గురించి తమకు సమాచారం లేదని చెప్పినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. అనంతరం ఫోన్‌లో వివరాలు తెలుసుకున్న తర్వాత ఇటీవల ఓ బాలికను కుక్క కరిచిన ఘటన జరిగినట్లు వెల్లడించారని పేర్కొన్నారు.

అధికారులు స్పందించాలి : విద్యార్థుల భద్రతకు సంబంధించిన ఇంతటి కీలక సమస్యపై పాఠశాల యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. అసంపూర్తి ప్రహరీ గోడను పూర్తిచేయడంతో పాటు పాఠశాల పరిసరాలను శుభ్రపరచి, వీధి కుక్కలు, పాముల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.