BREAKING
రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు రోజంతా సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో జరిగే అనర్థాలు ఇవే.. డీహైడ్రేషన్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న రియల్ స్టోరీ క్రైమ్ థ్రిల్లర్.. వీకెండ్‌లో చూసేందుకు అద్భుతమైన మూవీ కొప్పర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి - సిపిఎం వట్టిప్రోలు రంగారావు ను సత్కరించిన...... వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు షేక్ నాజర్ లీజుకు తీసుకున్న బస్సులు అమ్ముకున్నారని ఆరోపణ.. బాధితులకు న్యాయం చేయాలి అంటున్న నల్లి రాజేష్.*

గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ పంపిణీ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం -- ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

Select Suryaa Now
గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ పంపిణీ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం  -- ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

పెదవేగి, మేజర్ న్యూస్:పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామ పంచాయతీ పరిధిలోని చుట్టుగుంట గ్రామంలో సుమారు రూ. 25 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 24 గంటల నిరంతర త్రీ-ఫేస్ విద్యుత్ సరఫరాను  చింతమనేని ప్రభాకర్  శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే కి మహిళలు, గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పూజలు నిర్వహించి స్విచ్ఛాన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని, గతంలో లో-వోల్టేజీతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఇకపై పూర్తి ఊరట లభిస్తుందని స్పష్టం చేశారు.అనంతరం గ్రామంలోని వీధుల్లో ఎమ్మెల్యే చింతమనేని కాలినడకన పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నిలిచిపోయిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సిమెంట్ రోడ్ల పనులను 15 నుంచి 20 రోజుల్లోపు ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. పర్యటనలో భాగంగా స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే చింతమనేని చిన్నారులతో ముచ్చటించి వారికి అందిస్తున్న గుడ్లు, పాలు, పౌష్టికాహార నాణ్యతను పరిశీలించి కేంద్రంలో మౌలిక వసతులు మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ అంబేద్కర్, పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు ఈడుపుగంటి అనిల్, దుగ్గిరాల మాజీ ఉపసర్పంచ్ చింతమనేని చిన్న గోపి, సీనియర్ నాయకులు చింతమనేని సతీష్ సహా పలువురు అధికారులు, పంచాయతీ సిబ్బంది, కూటమి నాయకులు , గ్రామస్తులు పాల్గొన్నారు.

 న్యూస్ బ్యూరో కే బాలసౌరి ఏలూరు