ప్రతిష్టాత్మకమైనా... ప్రశాంతంగానే ముగిసిన ఎస్.రాయవరం హైస్కూల్ ఎన్నికలు!
ఎస్.రాయవరం, అక్టోబర్ 9, మేజర్ న్యూస్: రెండు సార్లు వాయిదా పడినా మొత్తానికి మూడోసారి ప్రశాంతగానే ఎస్.రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక పూర్తి అయింది. ఎట్టకేలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు ఏర్పాట్లు, పోలీసులు సహకారాన్ని విద్యాశాఖ అధికారులు తీసుకున్నారు. ఎన్నికలు జరిగినా అందుకు సంబందించిన అన్ని ఏర్పాట్లు చేసేసారు. ఈ ఎన్నికలో తల్లిదండ్రులే ఓటర్లుగా వున్నా ఈ ఎన్నిక రెండు సార్లు వాయిదా పడినా మూడో సారి ఎన్నికల్లో గొడవలు, వాగ్వాదాలు జరగకుండా సీఐ రామకృష్ణ, ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసారు. మండల విద్యాశాఖ అధికారి పెన్నాడ అప్పారావు చెప్పిన వివరాల ప్రకారం ఎన్నిక ఏకగ్రీవం అయిందని చైర్మన్ గా వాసం ప్రసాద్, వైస్ చైర్మన్ గా అద్దాల దేవి ఎన్నికయ్యారని వెల్లడించారు. నూతన కమిటీ సభ్యులను శాలువాలు, పూల దండలతో అక్కడకొచ్చిన వారంతా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎస్.రమణ, ఉపాధ్యాయ సిబ్బంది ఓటర్లు అయిన తల్లితండ్రులను సమన్వయపరిచి ప్రశాంతంగా ఎన్నిక ప్రక్రియ సాగేలా తమ వంతు పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో ఎస్.రాయవరం ప్రముఖులు పలువురు పాల్గొన్నారు.