*పాలకొల్లులో ప్రపంచ తపాలా దినోత్సవ వేడుకలు.* *తపాలా సిబ్బందికి యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ఘన సత్కారం.*
పాలకొల్లు మేజర్ న్యూస్ ప్రపంచ తపాలా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాలకొల్లు హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో తపాలా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్లబ్ గవర్నర్ పెనుమాక రామ మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొనగా, క్లబ్ అధ్యక్షులు డాక్టర్ సంగినీడి వెంకట రంగారావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా పాలకొల్లు హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో పోస్టుమాన్‌లుగా విధులు నిర్వహిస్తున్న వాసా కుమారస్వామి, మేడపాటి కరుణానిధితో పాటు హెడ్ పోస్ట్ మాస్టర్ గాజులపాటి సూర్యనారాయణను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ప్రజలకు తపాలా సేవలను అందించడంలో పోస్టల్ సిబ్బంది అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ప్రజలకు ఉత్తరాలు, పార్శిళ్లు చేరవేయడంతో పాటు సమాచార వ్యవస్థలో తపాలా శాఖ పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.తపాలా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొట్టి భాస్కరరావు సేకరించిన వివిధ రకాల పోస్ట్‌కార్డులు, లెటర్లు, స్టాంపులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గతకాలపు తపాలా వ్యవస్థను గుర్తుచేసే ఈ సేకరణను పలువురు ఆసక్తిగా తిలకించారు. కాలానుగుణంగా సమాచార సాంకేతికతలో అనేక మార్పులు వచ్చినప్పటికీ, ప్రజలకు సేవలందించడంలో తపాలా శాఖకు ప్రత్యేక స్థానం ఉందని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి గంధం యేసుపాదం, కోశాధికారి శిరిగినీడి రాంబాబు, క్లబ్ సభ్యులు కానూరి ప్రభాకర్, గుండుమొగుల వీరాస్వామి, యర్రంశెట్టి వెంకటరత్నం, కర్రా నరసింహారావు, లంకలపల్లి ఖగరాజు, కొట్టి భాస్కరరావు, యాతం రమేష్, భీమనాధం సత్యనారాయణ, కూనపరెడ్డి చిన్ని, మండెల ఫణితో పాటు హెడ్ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్ నరసింహారావు పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లా