BREAKING
లీజుకు తీసుకున్న బస్సులు అమ్ముకున్నారని ఆరోపణ.. బాధితులకు న్యాయం చేయాలి అంటున్న నల్లి రాజేష్.* అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్.. కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం నటించని స్టార్ హీరోయిన్ కార్మికుల కొరత పరిష్కారానికి లావోస్ తీవ్ర కసరత్తు: స్వర్ణాంధ్ర కాలేజి ని సందర్శించిన నాక్ ఈసీ కమిటీ చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి.. ఏమన్నారంటే? ఉత్తర కొరియా ముప్పుపై దక్షిణ కొరియా, జపాన్ రక్షణ శాఖల కీలక భేటీ: రూ.248 కోట్లతో నర్సీపట్నం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి! రూ.3 కోట్లతో వాకింగ్ ట్రాక్, కళ్యాణ మండపం పనులకు శ్రీకారం : స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇథియోపియా నేషనల్ ప్యాలెస్, మ్యూజియంను సందర్శించిన విదేశాంగ మంత్రి జైశంకర్ బీసీలకు టీడీపీ అండగా ఉంటుంది బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడు గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ బాలిక దినోత్సవం శీనయ్యకు..జిల్లా పెద్ద బాధ్యతలు..! కోట్యాడ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయుడు రంభ వెంకట రమణకు సన్మానం ఉపాధి పనులు వేగవంతం చేయాలి ప్రజాదర్బార్‌కు విశేష స్పందన.. స్వీకరించిన ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి -- జెసి కె.ఆర్. కల్పశ్రీ, విప్ నాయకర్

డిజిటల్ విధానంలో ఎరువుల విక్రయాలు – ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌పై అవగాహన కార్యక్రమం*

Select Suryaa Now
డిజిటల్ విధానంలో ఎరువుల విక్రయాలు – ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌పై అవగాహన కార్యక్రమం*

పాలకొల్లు సూర్య న్యూస్ రైతులకు ఎరువుల విక్రయాలను మరింత పారదర్శకంగా, సులభతరంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ (ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫెర్టిలైజర్‌ సేల్‌) యాప్‌ ద్వారా ఎరువుల విక్రయాలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి గెడ్డం సునీత సూచించారు. శుక్రవారం పాలకొల్లులోని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఎరువుల డీలర్లు, సహకార సంఘాల సిబ్బందికి డిజిటల్‌ విధానంలో ఎరువుల కొనుగోలు ప్రక్రియపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భీమవరం నుంచి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి సునీత మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌, ఈ-పాస్‌ యంత్రాల ద్వారా రైతులకు ఎరువుల విక్రయాలు జరపాల్సి ఉంటుందని వివరించారు. నూతన విధానంపై ఎరువుల డీలర్లు, సహకార సంఘాల సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ఈ సందర్భంగా పాలకొల్లు సహాయ వ్యవసాయ సంచాలకులు (ఆర్‌) పి. మురళీకృష్ణ మాట్లాడుతూ, ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ ద్వారా రైతులు తమకు అవసరమైన ఎరువులను స్వయంగా ముందుగా నమోదు చేసుకుని, తమకు నచ్చిన ఎరువుల డీలర్‌ వద్దకు వెళ్లి బుక్‌ చేసుకున్న క్యూఆర్‌ కోడ్‌ను చూపించి ఎరువులు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. డిజిటల్‌ విధానం ద్వారా ఎరువుల కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు విక్రయాల్లో పారదర్శకత పెంపొందించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.ఈ కార్యక్రమంలో పాలకొల్లు, పోడూరు, ఆచంట మండలాల వ్యవసాయ అధికారులు కె. రాజశేఖర్‌, ఎం. విశ్వాసరావు, బి. నాగరాజు, మూడు మండలాలకు చెందిన ఎరువుల డీలర్లు, సహకార సంఘాల కార్యదర్శులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ నరసింహారావు పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లా