BREAKING
బాలాజీనగర్‌ రవీంద్ర భారతిలో ఘనంగా దసరా వేడుకలు దసరా ఉత్సవాలకు యోగి, ఓం బిర్లాకు ఆహ్వానం మొబైల్‌ కోర్టులో 14 కేసులు.. రూ.3,810 జరిమానా మాంసం దుకాణాల్లో తనిఖీలు.. - నిబంధనలు ఉల్లంఘించిన దుకాణం సీజ్‌ జై భవానీ నినాదంతో విధులు నిర్వర్తించాలి.. గ్రామీణ రహదారుల అభివృద్ధికి పెద్దపీట : పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కొత్తూరు తాడేపల్లి వన సంరక్షణ సమితి అధ్యక్షుడిగా ఆంజనేయులు తనూజ, వర్షాల చదువుకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందించిన గద్దె క్రాంతి కుమార్ మూలపాడు వేదికగా ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం.. కఠోర సాధనలో ఇరు జట్లు ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ

నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ

Select Suryaa Now
నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ

నకరికల్లు: మండలంలోని నకరికల్లులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవ రెడ్డి సమన్వయంతో, రామవరెడ్డి ఆధ్వర్యంలో గ్రామాధ్యక్షుడు బైరెడ్డి పరమేశ్వర్‌రెడ్డి పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.