BREAKING
మూడు పదవుల ముచ్చటేనా.. బాధ్యతల సంగతేంటి? బొడ్డు వెంకటరమణ కు మూడు కీలక పదవు లపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన, వ్యక్తిత్వ పోటీలు తైలాభిషేకాలతో శనేశ్వరాలయం…దర్శనానికి పోటెత్తిన భక్తులుస్వా మివారికి రూ.5.16 లక్షల ఆదాయం ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల

జై భవానీ నినాదంతో విధులు నిర్వర్తించాలి..

Select Suryaa Now
జై భవానీ నినాదంతో విధులు నిర్వర్తించాలి..

 అమ్మవారి సేవలో అంకితభావం.. విధుల్లో భక్తిభావం వెల్లివిరియాలి

 అధికారులు, సిబ్బందికి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ దిశానిర్దేశం

 సెక్టార్ల వారీగా స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌కు విధుల కేటాయింపు

 పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు, వీఎంసీ ధ్యాన‌చంద్ర

విజ‌య‌వాడ‌ బ్యూరో, మేజర్ న్యూస్ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహించే దసరా మహోత్సవాల సందర్భంగా అధికారులు, సిబ్బంది “జై భవానీ” నినాదంతో భక్తిశ్రద్ధలు, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. అమ్మవారి సేవలో పాల్గొనడం ఒక పవిత్రమైన అవకాశంగా భావిస్తూ దూరప్రాంతాల నుంచి తరలివచ్చే ల‌క్ష‌లాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవాభావంతో విధులు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. శుక్ర‌వారం న‌గ‌రంలోని డా. బి.ఆర్‌.అంబేద్క‌ర్ క‌ళావేదిక‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌, సీపీ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎం, ఆల‌య ఈవో వీకే శీనా నాయ‌క్‌, అడిష‌న‌ల్ సీపీ కేజీవీ స‌రిత‌, విజ‌య‌వాడ ఆర్‌డీవో వెన్నెల శ్రీను త‌దిత‌రులు ద‌స‌రా విధుల్లో ఉండే అధికారులు, సిబ్బందితో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ గత సంవత్సరం 20 లక్షల మంది వరకు భక్తులు వచ్చారని ఈసారి 25 లక్షల వరకు భక్తులు రావచ్చని.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. దసరా మహోత్సవాల విధుల్లో నియమితులైన సెక్టార్ ఇన్‌చార్జ్ అధికారులు, ఇతర సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాలను ముందుగానే సందర్శించి పరిస్థితులను సమీక్షించాలని, విధుల మార్పిడి సమయంలో ముందుగానే హాజరై బాధ్యతలు స్వీకరించాలన్నారు. ప్రతి సెక్టార్‌లోని కీలక ప్రాంతాలు, సమస్యాత్మక ప్రదేశాలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ప్రణాళికలు, భ‌ద్ర‌త ఏర్పాట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, విధుల్లో ఉన్న అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు వెంటనే చేరవేయాలని తెలిపారు. సామాన్య భక్తులకు ఎక్కడైనా అసౌకర్యం కలిగితే తక్షణమే స్పందించి పరిష్కరించాలని, వృద్ధులు, మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, దివ్యాంగుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. విద్యుత్, నిర్మాణాల భద్రత, తాగునీరు, ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, క్యూలైన్లు, మహిళల భద్రత, చిన్నారుల సంరక్షణ, భక్తుల రాకపోకలకు సురక్షిత మార్గాలు, లైటింగ్,  సూచిక బోర్డులు, సమాచార బోర్డుల‌పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఎక్కడైనా భక్తులు గుమిగూడితే కారణాన్ని వెంటనే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వీధి వ్యాపారుల వల్ల భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసుల సమన్వయంతో వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. భక్తుల రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచాలని, రహదారుల కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని, ప్రతి సెక్టార్‌కు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. భక్తులతో నిరంతరం మమేకమవుతూ ఆన్‌లైన్ సమాచార, అభిప్రాయ సేకరణ సదుపాయాలపై అవగాహన కల్పించాలని, ఏవైనా ప్రత్యేక సహాయ సహకారాలు అవసరమైతే జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ దసరా మహోత్సవాల్లో సామాన్య భక్తుల సంతృప్తి, భద్రతే అత్యున్నత ప్రాధాన్యమని, ప్రతి భక్తునికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే తమ కర్తవ్యమని, పని దైవంతో సమానం అనే స్ఫూర్తితో అంకితభావంతో విధులు నిర్వర్తించాలని పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు అన్నారు. స‌మావేశంలో సెక్టార్ల అధికారులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా