కొత్తూరు తాడేపల్లి వన సంరక్షణ సమితి అధ్యక్షుడిగా ఆంజనేయులు
విజయవాడ రూరల్, మేజర్ న్యూస్ : విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి వన సంరక్షణ సమితి నూతన కమిటీ ఎన్నికలు హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం శుక్రవారం నిర్వహించారు. అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికల్లో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.చైర్ పర్సన్ గా చిగురుపల్లి ఆంజనేయులు, వైస్ చైర్ పర్సన్ గా తాడిశెట్టి సుజాత ఎన్నికయ్యారు.అదేవిధంగా నూతన కమిటీ సభ్యులుగా కంపా రాయమ్మ, తాడిశెట్టి వెంకటరమణ, నక్కా భవాని, చప్పిడి అంజమ్మ, ఓ సూరి నాగమ్మ, ముద్రబోయిన వెంకట దుర్గ, బెజవాడ బాలయ్య, జోనిబోయిన సుబ్బారావు, బొంతు చంద్రశేఖర్, సుంకర హనుమంతరావు, కంభం వెంకయ్య, బొడ్డు వెంకటేశ్వరరావు ఎన్నికవ్వడం జరిగిందని తీర్మానించారు.ఈ కార్యక్రమంలో నున్న బీట్ ఎఫ్‌బిఓ, కొత్తూరు తాడేపల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కె.జయ శంకర్ రావు, డివైఆర్ఓ విజయవాడ పాల్గొన్నారు.
✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా