BREAKING
మూడు పదవుల ముచ్చటేనా.. బాధ్యతల సంగతేంటి? బొడ్డు వెంకటరమణ కు మూడు కీలక పదవు లపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన, వ్యక్తిత్వ పోటీలు తైలాభిషేకాలతో శనేశ్వరాలయం…దర్శనానికి పోటెత్తిన భక్తులుస్వా మివారికి రూ.5.16 లక్షల ఆదాయం ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల

తైలాభిషేకాలతో శనేశ్వరాలయం…దర్శనానికి పోటెత్తిన భక్తులుస్వా మివారికి రూ.5.16 లక్షల ఆదాయం

Select Suryaa Now
తైలాభిషేకాలతో శనేశ్వరాలయం…దర్శనానికి పోటెత్తిన భక్తులుస్వా మివారికి రూ.5.16 లక్షల ఆదాయం

కొత్తపేట,మేజర్ న్యూస్:అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని మందపల్లి శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామివారి ఆలయానికి శనివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.

దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.అమావాస్య సందర్భంగా ఆలయంలో ప్రాతఃకాల అర్చనలు,ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో తైలాభిషేకాలు సమర్పించి,సర్వదర్శనం చేసుకున్నారు.స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఆలయ సహాయ కమిషనర్,కార్యనిర్వహణాధికారి దారపురెడ్డి సురేష్‌బాబు ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు.

దర్శనం,తైలాభిషేకాల నిర్వహణతో పాటు భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.అమావాస్య సందర్భంగా ఆలయంలో నిర్వహించిన వివిధ సేవలు, తైలాభిషేకాల ద్వారా స్వామివారికి రూ.5,16,431 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో సురేష్‌బాబు తెలిపారు.