BREAKING
మూడు పదవుల ముచ్చటేనా.. బాధ్యతల సంగతేంటి? బొడ్డు వెంకటరమణ కు మూడు కీలక పదవు లపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన, వ్యక్తిత్వ పోటీలు తైలాభిషేకాలతో శనేశ్వరాలయం…దర్శనానికి పోటెత్తిన భక్తులుస్వా మివారికి రూ.5.16 లక్షల ఆదాయం ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల

మూడు పదవుల ముచ్చటేనా.. బాధ్యతల సంగతేంటి? బొడ్డు వెంకటరమణ కు మూడు కీలక పదవు లపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి

Select Suryaa Now
మూడు పదవుల ముచ్చటేనా.. బాధ్యతల సంగతేంటి? బొడ్డు వెంకటరమణ కు మూడు కీలక పదవు లపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి

రాజానగరం , మేజర్ న్యూస్ : ఒకే నాయకుడికి మూడు కీలక పదవులు దక్కినా.. వాటి ద్వారా పార్టీకి, ప్రభు త్వ యంత్రాంగానికి ఆశించిన ప్రయోజనం చేకూరుతోందా? జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం ఈ ప్రశ్న చర్చనీయాం శంగా మారింది. కాకినాడ జిల్లాకు చెందిన బొడ్డు వెంకటరమణ చౌదరికి రాజానగరం నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జి, రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (రుడా) చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు వంటి బాధ్యతలు అప్పగించడం పై పార్టీ వర్గాల్లో భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవు తున్నాయి.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ మూడు బాధ్యతలను ఆయన ఏ మేరకు సమర్థంగా నిర్వ హిస్తారన్న చర్చ మొదలైంది.

రాజానగరం ఇన్చార్జిగా విఫలం :

బొడ్డు వెంకటరమణ చౌదరిని సుమారు నాలు గేళ్ల క్రితం రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా నియమిం చారు.అయితే, నియోజక వర్గంలో పార్టీపై పూర్తి స్థాయి పట్టు సాధించలేక పోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అడపా దడపా సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తు న్నప్పటికీ పార్టీ అంతర్గత విభేదాలను పరిష్కరిం చడం, అసంతృప్తితో ఉన్న నాయకులను కలుపుకొని ముందుకు వెళ్లడంలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని కొందరు పార్టీ నేతలు అభిప్రాయపడు తున్నారు.స్థానిక జనసేన ఎమ్మెల్యేతోనూ ఆయన సమన్వయం అంతంత మాత్రంగానే ఉందన్న చర్చ సాగుతోంది. రెండు పార్టీల నాయకులు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే విమ ర్శలు ఉన్నాయి. ఇటీవల బూరుగుపూడిలో జరిగిన పార్టీ సమావేశంలో ఓ నాయకుడు పార్టీ పరిస్థితిపై ఘాటుగా వ్యాఖ్యానించినట్లు స్థానికంగా చర్చ జరుగు తోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు ముందు నియోజక వర్గంలో పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకు రావడం ఆయనకు కీలకంగా మారింది. నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం ఇస్తుండడం తో స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు వెంకటరమణ కు  పెద్ద సవాల్ గా మారనుంది.

కూటమిలో కుంపట్లు.. సీట్ల సర్దుబాటు ఎలా? :

జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా వివిధ నియోజకవర్గాల్లో నెల కొన్న విభేదాల పరిష్కా రంపై వెంకటరమణ చౌదరి దృష్టి సారించలేక పోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు, స్థానిక ప్రాధాన్యాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండ టం తో రానున్న ఎన్నికల్లో సమన్వయం సాధించడం పార్టీ నాయకత్వానికి సవాలు గా మారే అవ కాశం ఉంది.

నిడదవోలు నియోజక వర్గంబిల్లులో టీడీపీ ఇన్‌చార్జి బూరుగుపల్లి శేషారావు, మంత్రి కందుల దుర్గేష్ మధ్య విభేదాలు అంతర్యుద్ధం సాగుతుంది. గత ఏడాది పురపాలక సంఘంలో మున్సిపల్ చైర్మన్ ఇద్దరు వైస్ చైర్మన్ కలిపి 16 మంది కౌన్సిలర్లను మంత్రి తన పార్టీలో చేర్చుకుని మున్సిపాలిటీపై అధి పత్యం సాధించారు. గత ఎన్నికల్లో టిడిపి ఇక్కడ ఒకే కౌన్సిలర్ స్థానాన్ని గెలుపొందింది. ఈ నేపథ్యం లో మున్సి పాలిటీ కచ్చితంగా తమకే కేటాయించాలని జనసేన పట్టుబడుతుంది.ఎమ్మెల్యే సీటు పొత్తులో భాగంగా త్యాగం చేసినందున మున్సిపాలిటీ తమకు కేటాయించాలని టిడిపి గట్టిగానే డిమాండ్ చేస్తుంది.మున్సిపాలిటీలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ,జనసేన వర్గాలు పట్టుబడుతు న్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టులను జనసేన పార్టీ ఎక్కువ స్థానాలను తీసుకుంది. దీంతో అసంతృప్తిగా ఉన్న టిడిపి శ్రేణులను బుజ్జగించి కూటమి ఒత్తు ధర్మం ప్రకారం సీట్ల సర్దు బాటులో చేయడం జిల్లా టిడిపి అధ్యక్షుడికి కదా తలనొప్పిగా మారనుంది.
బీజేపీ కూడా తమకు తగిన ప్రాతినిధ్యం కల్పిం చాలని కోరుతున్న నేప థ్యంలో నిడదవోలు లో కూటమి పార్టీల మధ్య సయోధ్య కుదరడం అంత సులభం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి.

కొవ్వూరు టిడిపిలో దశాబ్దానికి పైగా గ్రూపు రాజకీయాలు :

కొవ్వూరు టీడీపీలోనూ చాలాకాలంగా రెండు వర్గాలు కొనసాగుతు న్నాయన్నాయి.మాజీ మంత్రి కేఎస్‌ జవహర్, అచ్చిబాబు వర్గాలు వేర్వేరుగా వ్యవహ రిస్తున్నాయని, జవహర్ వర్గానికి తగిన గుర్తింపు లభించడం లేదు.ఈ విభేదాలను పరిష్కరించి పార్టీ శ్రేణులను సమన్వ యం చేయడంలో జిల్లా అధ్యక్షుడి పాత్ర కీలక మని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. స్థానిక ఎన్నికలు సమీపించిన తరుణంలో రెండు గ్రూపులను సమన్వయపరచడం, కూటమి భాగస్వామ్య పార్టీలకు మచ్చ చెప్పి సీట్లు సర్దుబాటు చేయడం పెద్ద సమస్యగా మారనుంది.
కొవ్వూరులో టీడీపీ, జనసేన నాయకుల మధ్య కూడా విభేదాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.గతంలో టీడీపీ కార్యాలయంలో జనసేన నాయకుడిపై దాడి జరిగింది. అప్పటినుంచి రెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచాయని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జన సేన నియోజకవర్గ ఇన్‌చార్జి టీవీ రామా రావు, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మధ్య సంకేత అంతంత మాత్రమేనని చెప్పవచ్చు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో తమకు తగిన ప్రాధాన్యం దక్క లేదని జనసేన వర్గాలు గతంలో అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భా లున్నాయి.

ఇతర నియోజకవర్గాల్లోనూ విభేదాల చర్చ :

రాజమహేంద్రవరం రూరల్‌లో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంత్రి కందుల దుర్గేష్ మధ్య విభేదాలు న్నాయన్న చర్చ రాజకీ య వర్గాల్లో కొనసాగు తోంది.రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మధ్య కూడా కొంతకాలంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా యని ప్రచారం జరుగు తోంది.గోపాలపురం నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేకు, కొందరు టీడీపీ నాయకులకు మధ్య విభేదాలున్నాయ న్న వాదనలు వినిపిస్తు న్నాయి.టికెట్ ఖరారు సమయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన కొందరు నాయకులు ఇప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని స్థానిక నేతలు చెబుతు న్నారు. కొవ్వూరు గోపాలపురం ఎమ్మెల్యే లకు మధ్య సఖిత అంతంత మాత్రమే ఉంది.ఇన్ని నియోజకవర్గాల్లో విభేదా లున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడిగా వెంకట రమణ చౌదరి వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుం టారన్నది చర్చనీయాం శంగా మారింది. జిల్లా అధ్యక్ష పదవి కేటాయిం పు సమయంలో స్థానిక సీనియర్లను పక్కనపెట్టి మరో జిల్లాకు చెందిన నాయకుడికి అవకాశం కల్పించడంపై కొందరు టీడీపీ శ్రేణుల్లో అసం తృప్తి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. వైఎస్సా ర్‌సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకుడికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించ డంపై కూడా కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

రుడా పనితీరుపైనా విమర్శలు :

రుడా చైర్మన్‌గా వెంకట రమణ చౌదరి పనితీరు పైనా విమర్శలు వినిపిస్తు న్నాయి. రుడా పరిధిలో లేఅవుట్ల నియంత్రణ, అక్రమ లేఅవుట్లపై పర్య వేక్షణ, అభివృద్ధి పనుల అమలు వంటి అంశాల్లో మరింత చురుకుదనం అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొన్ని లేఅవుట్లలో అక్రమాలు జరుగుతు న్నాయన్న ఆరోపణలు ఉన్నప్పటికీ, వాటిపై వెంకటరమణ శ్రద్ధ చూపడం లేదన్న విమర్శ లు ఉన్నాయి.
అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రుడా పరిధిలోని రాజమ హేంద్రవరం, నిడదవోలు, కొవ్వూరు, దేవరపల్లి తదితర ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టి నట్లు రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ప్రస్తు త పాలనలో రుడా ద్వారా చేపడుతున్న పనులు, నిధుల వినియో గం, లేఅవుట్ల పర్యవేక్షణ పై మరింత స్పష్టత ఇవ్వా ల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. అయితే, రుడా పనితీరుపై వస్తున్న విమర్శలను నిర్ధారించేం దుకు అధికారిక గణాంకా లు, ప్రస్తుత ప్రాజెక్టుల వివరాలు పరిశీలించాల్సి ఉంటుంది.

స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష :

నియోజకవర్గ ఇన్‌చార్జి గా, రుడా చైర్మన్‌గా, జిల్లా అధ్యక్షుడిగా మూడు కీలక బాధ్యతలు నిర్వహి స్తున్న బొడ్డు వెంకటర మణ చౌదరికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. పార్టీ అంతర్గత విభేదాల ను పరిష్కరించడం, సీనియర్ నాయకులకు తగిన ప్రాధాన్యం కల్పిం చడం, కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం సాధించ డం ఆయన ముందున్న ప్రధాన సవాళ్లుగా కనిపి స్తున్నాయి. మూడు పదవుల బాధ్యతలను సమన్వయం చేస్తూ పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన అనుసరించే వ్యూహం ఎలా ఉంటుం దన్నది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీ యాంశంగా మారింది.