BREAKING
మూడు పదవుల ముచ్చటేనా.. బాధ్యతల సంగతేంటి? బొడ్డు వెంకటరమణ కు మూడు కీలక పదవు లపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన, వ్యక్తిత్వ పోటీలు తైలాభిషేకాలతో శనేశ్వరాలయం…దర్శనానికి పోటెత్తిన భక్తులుస్వా మివారికి రూ.5.16 లక్షల ఆదాయం ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల

గ్రామీణ రహదారుల అభివృద్ధికి పెద్దపీట : పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్

Select Suryaa Now
గ్రామీణ రహదారుల అభివృద్ధికి పెద్దపీట : పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్

రూ.6 కోట్లతో నిర్మించిన రహదారి ప్రారంభం

ఉయ్యూరు, మేజర్ న్యూస్ : ఉయ్యూరు మండలం ఆకునూరు, కడవకొల్లు గ్రామాల పరిధిలో రూ.6 కోట్లతో నిర్మించిన నూతన రహదారిని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. అదేవిధంగా రూ.10 లక్షల నిధులతో చేపట్టనున్న డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నాణ్యమైన రహదారులు, మెరుగైన రవాణా సదుపాయాలు ఎంతో కీలకమన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక తారు మిశ్రమాన్ని ఉపయోగించి రహదారిని నిర్మించినట్లు తెలిపారు. ఈ మార్గం ద్వారా కుందేరు, ఆకునూరు, గండిగుంట, మూర్తిరాజుగూడెం గ్రామాల ప్రజలకు రవాణా సదుపాయాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. మూర్తిరాజుగూడెం–కుందేరు, కాటూరు–మానికొండ, కుందేరు–కందంపాడు, ముదునూరు–దూసరపాలెం రహదారుల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. తాడిగడప నుంచి ముదునూరు వరకు రహదారి అభివృద్ధితో పాటు ఉపాధి హామీ పథకం కింద గతంలో రూ.26 కోట్ల పనులు చేపట్టగా, తాజాగా మరో రూ.10 కోట్ల పనులకు నిధులు మంజూరయ్యాయని వివరించారు. గ్రామాల్లో తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని, అర్హులైన పేదలకు పింఛన్లు అందిస్తూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. గ్రామీణ రహదారులపై అధిక లోడుతో ప్రయాణించే లారీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

✍️ప్రేమ్ రాజ్, ఉయ్యూరు, కృష్ణా జిల్లా