బాలాజీనగర్ రవీంద్ర భారతిలో ఘనంగా దసరా వేడుకలు
కృష్ణలంక, మేజర్ న్యూస్ : బాలాజీనగర్‌లోని రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్‌లో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవీంద్ర భారతి విద్యాసంస్థల ఛైర్మన్ వీరమాచనేని వంశీకృష్ణ, వీరమాచనేని శాంతి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, ఏఓ తాన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దసరా పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరిస్తూ, చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ పండుగ ప్రతీక అని తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు సత్యం, ధర్మం, మంచితనం వంటి విలువలను పిల్లల్లో పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆనందోత్సాహాల మధ్య దసరా వేడుకలు ముగిశాయి. ఈ వేడుకల్లో టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా