BREAKING
ఎంపీ పై టీపీసీసీకి ఫిర్యాదు నేడు రూరల్ ఎంపీపీ గా కత్తి కళ్యాణి ప్రమాణ స్వీకారం వైస్ ఎంపీపీ ఎన్నిక.. ఎంపీపీని చేతులెత్తి ఎన్నుకోనున్న ఎంపీటీసీలు ఎంపీపై టీపీసీసీకి ఫిర్యాదు ఫిర్యాదు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎస్వీ నగర్ లో తాగునీటి సమస్యకు పరిష్కారం.. 16 డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి... కార్పొరేటర్ ఆర్. నాగభూషణం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ప్రజా సమస్యలపై hనిరంతరం పోరాడుతున్న సిపిఐ అభ్యర్థులను గెలిపించండి! సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు... పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం! కె జె పురం శాఖ గ్రంధాలయం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు

పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం

Select Suryaa Now
పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం

సూర్య జాతీయ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంతో పాటు సుమారు 70 శాతం ముస్లిం జనాభా కలిగిన ముర్షిదాబాద్ జిల్లాలోని రెజీనగర్ నియోజకవర్గంలోనూ జయకేతనం ఎగురవేసింది. బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జరిగిన ఈ ఉపఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో వస్తున్న మార్పులను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.

రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ ఏకంగా 1,22,753 ఓట్ల రికార్డు మెజారిటీతో సమీప కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌పై ఘనవిజయం సాధించారు. బీజేపీ తన సంప్రదాయ కంచుకోటను మరింత పటిష్టం చేసుకోవడమే కాకుండా, నందిగ్రామ్‌లో తన బలాన్ని తిరుగులేని రీతిలో నిరూపించుకుంది. మరోవైపు ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉండే రెజీనగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి శంఖరావ్ సర్కార్ 75,816 ఓట్ల భారీ తేడాతో ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJUP) అభ్యర్థి గులామ్ నబీ ఆజాద్‌ను ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేశారు.

ఈ ఫలితాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి హర్షం వ్యక్తం చేస్తూ.. మైనారిటీ వర్గాలు కూడా అభివృద్ధి, సుపరిపాలనకే పట్టం కట్టాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ ప్రజలు ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిపారు. ఈ రెండు స్థానాల్లో సాధించిన విజయాలతో 294 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ శాసనసభలో బీజేపీ బలం 209కి చేరింది. భిన్న వర్గాల ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా బీజేపీ పాలనపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.