BREAKING
మూడు పదవుల ముచ్చటేనా.. బాధ్యతల సంగతేంటి? బొడ్డు వెంకటరమణ కు మూడు కీలక పదవు లపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన, వ్యక్తిత్వ పోటీలు తైలాభిషేకాలతో శనేశ్వరాలయం…దర్శనానికి పోటెత్తిన భక్తులుస్వా మివారికి రూ.5.16 లక్షల ఆదాయం ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల

ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు

నారాయణపేట, సూర్యన్యూస్:
విద్యా సంస్థల్లో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ వేద సరస్వతి జూనియర్ కళాశాల, కృష్ణ గోకులం, శ్రీసాయి స్కూల్, మండలంలోని జాజాపూర్ జడ్పీ స్కూల్, అమ్మిరెడ్డి పల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు పసుపుతో గౌరమ్మను, రంగురంగు పూలతో బతుకమ్మను పేర్చి   ఆటపాటలతో నృత్యాలు చేసి పూలను నీటిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా పిఆర్టియు జిల్లా గౌరవ అధ్యక్షులు రఘువీర్ మాట్లాడుతూ.. తెలంగాణ వాసుల బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ అని, పూలను దేవుడిగా పూజించే చక్కటి సంస్కృతి అని కొనియాడారు. అనంతరం పూలతో పేర్చిన బతుకమ్మపై అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి భక్తి పాటలకు బొడ్డెమ్మలు వేశారు. చక్కటి సంప్రదాయ వస్త్రాదరణతో ఆడిన నృత్యాలు ఎంతో అలరించాయి. ఆయా కార్యక్రమంలో టీచర్లు భారతి, మంగళ, నిర్మల, శశిరేఖ, శిరీష, భానుప్రకాష్,  నర్సింలు, నరసింహ, ప్రతాప్, మధుసూదన్ రావు, రఘురాంరెడ్డి,  లక్ష్మణ్  వెంకటేష్ పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.