BREAKING
రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్! అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ చెక్‌ల పంచాయితీకి చెక్! దసరాకైనా "చేయూత" నిచ్చేనా...??

పెద్దపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి ఎనిమిది మంది అరెస్టు.. రూ.18,300 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, రెండు బైకులు స్వాధీనం

Select Suryaa Now
పెద్దపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి  ఎనిమిది మంది అరెస్టు.. రూ.18,300 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, రెండు బైకులు స్వాధీనం

 

సూర్య పెద్దపల్లి ప్రతినిధి 

 

పెద్దపల్లి పట్టణంలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.18,300 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.పెద్దపల్లి ఫ్లైఓవర్‌ సమీపంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో టౌన్‌ ఎస్‌ఐ నరేష్‌ తన సిబ్బందితో కలిసి సదరు ఇంటిపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.పట్టణంలో పేకాటతో పాటు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని, అలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నరేష్ స్పష్టం చేశారు.