BREAKING
నేటి రాశి ఫలాలు: 11 అక్టోబర్ 2026. నేటి పంచాంగం 11 అక్టోబర్ 2026 తులిప్ స్కూల్‌లో సందడిగా పీపుల్స్ లీడర్ ఎన్నికలు. కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్!

సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు

Select Suryaa Now
సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు
  • ఇంద్రధనుస్సులా మహిళల ఉత్పత్తులకు మార్కెట్ వేదిక..
  • అక్టోబర్ 15 నుంచి 31 వరకు పున్నమి ఘాట్‌లో నిర్వహణ..
  • ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ, అక్టోబర్ 10, మేజర్ న్యూస్ : మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతో పాటు, మహిళలను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సరస్ మేళాను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. కృష్ణానది తీరంలోని పున్నమి ఘాట్‌లో ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్ మేళా ఏర్పాట్లను శనివారం వారు పరిశీలించారు. ఈ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నట్లు ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. గత ఏడాది గుంటూరులో నిర్వహించిన సరస్ మేళా విజయవంతమైందని, అదే స్ఫూర్తితో విజయవాడలో మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ మేళాలో పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారని పేర్కొన్నారు. మహిళలు స్వయంగా తయారు చేసే హస్తకళా వస్తువులు, సంప్రదాయ ఉత్పత్తులు, గృహోపకరణాలకు సరస్ మేళా మంచి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని చెప్పారు. ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించి, జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు అందించడం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డ్వాక్రా, మెప్మా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ పిలుపునిచ్చారు. మహిళల నైపుణ్యం, సృజనాత్మకతకు గుర్తింపు తీసుకురావడంతో పాటు, వారి ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.