దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్ : ఆనవాయితీ ప్రకారం దసరా ఉత్సవాలకు ముందు రోజు కనకదుర్గమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు శనివారం రాత్రి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. నగర పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, ఈవో వి.కె. శీనా నాయక్ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయగా, దర్శనం పూర్తయిన తరువాత పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు.
రిపోర్టర్ : ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.