ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్ : దేవాదాయశాఖ కార్యదర్శి కే. కన్నబాబు శనివారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. టోల్‌గేట్ నుంచి క్యూ లైన్ల వరకు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను తనిఖీ చేశారు. యాక్సెస్ గేట్ల పనితీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కనకదుర్గమ్మవారిని దర్శించుకుని ఆలయ పరిసరాల్లోని ఇతర ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్. చంద్రశేఖర్ ఆజాద్, ఈవో వీకే శీనా నాయక్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.