BREAKING
నేటి రాశి ఫలాలు: 11 అక్టోబర్ 2026. నేటి పంచాంగం 11 అక్టోబర్ 2026 తులిప్ స్కూల్‌లో సందడిగా పీపుల్స్ లీడర్ ఎన్నికలు. కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్!

రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం

Select Suryaa Now
రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం
  • ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. కేఎల్ రాహుల్ రాకతో ప్రత్యేక ఆకర్షణ
  • పటిష్ట బ్యాటింగ్ లైనప్‌తో కర్ణాటక.. ధీటుగా ఎదుర్కొనేందుకు ఆంధ్ర జట్టు సిద్ధం
  • మ్యాచ్ నిర్వహణకు ఏసీఏ ఏర్పాట్లు పూర్తి.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ
  • ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు

విజయవాడ మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్, కర్ణాటక జట్ల మధ్య రేపటి నుంచి జరగనున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, ప్రతిరోజూ 90 ఓవర్ల ఆట నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పోరులో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లలో కఠోరంగా శ్రమించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సాధన చేస్తూ మ్యాచ్‌కు సన్నద్ధమయ్యారు.

కేఎల్ రాహుల్ రాకతో ప్రత్యేక ఆకర్షణ.. భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. కర్ణాటక జట్టులో కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్ వంటి ప్రతిభావంతులైన బ్యాటర్లు ఉండటంతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది.

యువ జట్టుతో విజయమే లక్ష్యంగా ఆంధ్ర… కెప్టెన్ రికీ భూయ్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న ఆంధ్ర జట్టు, పటిష్టమైన కర్ణాటక జట్టుకు ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధమైంది. యువ ఆటగాళ్ల సమష్టి ప్రదర్శనతో విజయం సాధిస్తామనే ధీమాతో ఆంధ్ర జట్టు ఉంది. ప్రత్యర్థి జట్టు బలాబలాలను అంచనా వేసుకుంటూ మెరుగైన ప్రదర్శనపై దృష్టి సారించింది.

మ్యాచ్‌కు ఏసీఏ ఏర్పాట్లు పూర్తి.. పోలీసుల పటిష్ట బందోబస్తు.. రంజీ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఆటగాళ్లు, మ్యాచ్ నిర్వహణ సిబ్బంది,  భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టింది. ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో ఎవరైనా యువకులు లేదంటే ఇంకెవరైనా అత్యుత్సాహం చూపిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.  మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు స్పష్టం చేశారు. కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాడి భాగస్వామ్యంతో ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

రిపోర్టర్ : ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.