BREAKING
అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల ఠానేలంక గురుకులంలో న్యాయ విజ్ఞాన సదస్సు...విద్యార్థినులతో మేజిస్ట్రేట్ ముఖాముఖి... నేటి రాశి ఫలాలు: 11 అక్టోబర్ 2026. నేటి పంచాంగం 11 అక్టోబర్ 2026 తులిప్ స్కూల్‌లో సందడిగా పీపుల్స్ లీడర్ ఎన్నికలు. కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ

తులిప్ స్కూల్‌లో సందడిగా పీపుల్స్ లీడర్ ఎన్నికలు.

Select Suryaa Now
తులిప్ స్కూల్‌లో సందడిగా పీపుల్స్ లీడర్ ఎన్నికలు.

అమలాపురం మేజర్ న్యూస్ :డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్యలో విలువలు, ఎన్నికల విధానం, నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తులిప్స్ స్కూల్ కరస్పాండెంట్ నెల్లి రమేష్ ఆధ్వర్యంలో పీపుల్స్ లీడర్ ఎన్నికలను శనివారం నిర్వహించారు. సాధారణ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో విద్యార్థులకు ప్రత్యక్షంగా తెలియజేయాలనే లక్ష్యంతో పాఠశాల ప్రాంగణంలో ఎన్నికల ప్రక్రియను విద్యార్థులకు తెలియజేసేలా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి  క్లాస్ పీపుల్ లీడర్ ,స్కూల్ పీపుల్ లీడర్ పదవులకు పోటీ చేశారు. అభ్యర్థులు తమకు మద్దతు ఇవ్వాలని తోటి విద్యార్థులను కోరుతూ,అభ్యర్ధులు తమ తమ ఎన్నికల గుర్తుతో  ప్రచారం నిర్వహించారు. సుమారు నెల రోజులపాటు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని, తమ లక్ష్యాలు, ఆలోచనలు, నాయకత్వ లక్షణాలను తోటి విద్యార్థులకు వివరించారు. ఎన్నికల ప్రచారం నుంచి ఓటింగ్ వరకు జరిగే వివిధ దశలను విద్యార్థులు స్వయంగా అనుభవించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

రాజకీయ పార్టీల ప్రచారాన్ని తలపించేలా ఎన్నికల సందడి తులిప్స్ స్కూల్ వద్ద పలువును ఆకట్టుకున్నాయి
సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో తమ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించడం, ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించడం, తమ ప్రణాళికలను వివరించడం వంటి కార్యక్రమాలు చేపడతాయి. అదే తరహాలో తులిప్ స్కూల్‌లోనూ విద్యార్థులు అభ్యర్థులుగా పోటీ చేస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ఎలా జరుగుతాయో కళ్లకు కట్టినట్లు చూపించేలా ఈ కార్యక్రమం సాగింది.
విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం పొందారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, ఓటు హక్కు వినియోగం, నాయకుడిని ఎన్నుకునే విధానం వంటి అంశాలను ఆచరణాత్మకంగా అర్థం చేసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రమే కాకుండా, ఓటరుగా బాధ్యతాయుతంగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో కూడా తెలుసుకున్నారు.
నాయకత్వ లక్షణాల పెంపునకు ప్రత్యేక కార్యక్రమం :
పాఠశాల స్థాయిలో నిర్వహించిన ఈ ఎన్నికలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, సమయపాలన, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని నిర్వాహకులు భావిస్తున్నారు. పోటీలో గెలుపొందిన వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం, ఓటమి పొందిన వారు ప్రజాస్వామ్య తీర్పును గౌరవించడం వంటి విలువలను విద్యార్థులు నేర్చుకునేలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకు విలువ ఉంటుందని, నాయకుడిని ఎన్నుకునే సమయంలో వ్యక్తిగత పరిచయాల కంటే అభ్యర్థి సామర్థ్యం, బాధ్యత, సేవాభావం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ తరహా కార్యక్రమాలు తెలియజేస్తాయి. భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి విద్యార్థి దశలోనే ఎన్నికలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం.
ప్రాక్టికల్ విద్యతో ప్రజాస్వామ్యంపై అవగాహన :
తులిప్ స్కూల్ కరస్పాండెంట్ నెల్లి రమేష్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఎన్నికల విధానంపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. సాధారణ ఎన్నికల తరహాలో పాఠశాలలో నిర్వహించిన ఈ ఎన్నికలు విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. పుస్తకాల్లో చదివే ప్రజాస్వామ్య పాఠాలను ఆచరణలో అనుభవించేలా చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలిచింది.
విద్యార్థులు ముందుకు వచ్చి పోటీలో పాల్గొనడం, ప్రచారం చేయడం, తమ నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను దగ్గరగా తెలుసుకున్నారు. విద్యతో పాటు సామాజిక బాధ్యత, నాయకత్వ నైపుణ్యాలు, ఎన్నికల అవగాహనకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఒక మంచి అనుభవంగా నిలిచింది. ఫిలిప్స్ స్కూల్ చేపట్టిన ఓటింగ్ ప్రక్రియ విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతగానో ఆకర్షించింది ఈ సందర్భంగా స్కూలు యాజమాన్యానికి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు ప్రత్యేక అభినందనలు తెలిపారు
సి పీ ఎల్ గా 7 రాగతి ఏ సెక్షన్  పినిశెట్టి కార్తీక్, 7బీ సెక్షన్ అంకేం తరుణ్ తేజ 7 సి ఎం అభిరామ్ , 8ఏ ఎస్ చరణ్ , 8బి వార పాశ్విన్, 9ఏ గొల్లపల్లి అక్షయ 9బి గుండెపూడి మేఘనాథ్ రెడ్డి, 10ఏ పంతాడ తేజ శ్రీనివాస్ ,10బి కడలి గోపి సుజయ్,ఎస్పీ ఎల్  గా కే రామిరెడ్డి ఎన్నికల్లో విజయం సాధించారు