BREAKING
నేటి రాశి ఫలాలు: 11 అక్టోబర్ 2026. నేటి పంచాంగం 11 అక్టోబర్ 2026 తులిప్ స్కూల్‌లో సందడిగా పీపుల్స్ లీడర్ ఎన్నికలు. కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్!

ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం

Select Suryaa Now
ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం

సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి :ఉపాధి హామీ పనుల కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. శాశ్వత ఆస్తుల నిర్మాణం, సహజ వనరుల సంరక్షణ లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై నుంచి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 4,02,360 పనిదినాలు కల్పించడంతో రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా పాలనా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

-​ప్రజాప్రతినిధులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశాల మేరకు గ్రామాల్లో పనుల గుర్తింపు, నిర్వహణపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. ప్రతి కూలీకి 125 రోజుల పని దినాలు కల్పించాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. రోజువారీ హాజరును పారదర్శకంగా నమోదు చేసేందుకు ప్రతి 40 మంది కూలీలకు ఒక సూపర్వైజర్  నియమించారు.

​-శాశ్వత ఆస్తుల కల్పనే ధ్యేయం

గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల్లో పూడికతీత, మట్టి రహదారుల నిర్మాణం, పంట కాలువల మరమ్మతులు, పశువులు, గొర్రెల వసతి గృహాలు, ఎరువుల తయారీ కేంద్రాలు, ఇళ్ల నిర్మాణ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నారు. అలాగే వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు కోసం ఇంకుడు గుంతలు, రీచార్జ్ బావుల నిర్మాణాలను వేగవంతం చేశారు.

​-హాజరులోనూ రికార్డు స్థాయి నమోదు

జిల్లాలోని 260 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రతిరోజూ సగటున ఒక్కో పంచాయతీ నుంచి 45 మందికి పైగా కూలీలు పనులకు హాజరవుతున్నారు. ఈ హాజరు శాతం రాష్ట్రంలోనే అత్యధికం. వేతనాల రూపంలో 12.90 కోట్లు చెల్లించగా, సామాగ్రి కొనుగోళ్లకు ప్రత్యేక నిధులు ఖర్చు చేస్తున్నారు.

రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం గర్వకారణం 

— గరిమ అగ్రవాల్, జిల్లా కలెక్టర్

"రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించి క్షేత్రస్థాయిలో పనులు చేయిస్తున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో కూలీలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం గర్వకారణం.