BREAKING
రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్! అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ చెక్‌ల పంచాయితీకి చెక్! దసరాకైనా "చేయూత" నిచ్చేనా...??

సుఖ సంతోషాలతో ఐక్యమత్యంగా పండుగలను జరుపుకోవాలి

Select Suryaa Now
సుఖ సంతోషాలతో ఐక్యమత్యంగా పండుగలను జరుపుకోవాలి

 

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

 సుఖ సంతోషాలతో ఐక్యమత్యంగా పండుగలను జరుపుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా శనివారం పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలలోస్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం దుర్గాభవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ప్రతిష్ట ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన దుర్గామాత మండపంలో స్థానిక నాయకులు తో కలిసి ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణంలో మహిళలు రంగు రంగు పూలతో అలంకరించిన బతుకమ్మలను స్థానిక అంగడి బజార్ లోని హనుమాన్ దేవాలయం ఎదుట ఉంచి తెలంగాణ బతుకమ్మ గీతాలను ఆలపిస్తూ లయబద్ధకంగా ఆడారు. వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి మాధవి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం బ్యాండ్ వాయిద్యాల మధ్య బాణాసంచాలు కాల్చుతూ ఊరేగింపుగా స్థానిక సుర సముద్రం చెరువు వద్దకు చేరుకొని బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, మార్కెట్ చైర్మన్ గీత నరసింహ, పలువురు కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, మహిళలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

ఎ. చంద్రశేఖర్: మేజర్ న్యూస్, ఆమనగల్లు.