దసరా ఉత్సవాలకు యోగి, ఓం బిర్లాకు ఆహ్వానం
విజయవాడ, మేజర్ న్యూస్ : విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు హాజరుకావాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారి దసరా ఉత్సవాల్లో, విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనాలని కోరారు. విజయవాడ ఆధ్యాత్మిక ప్రాధాన్యతను, ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పే లక్ష్యంతో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖులు, భక్తులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు.
✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా