BREAKING
తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు రోజంతా సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో జరిగే అనర్థాలు ఇవే.. డీహైడ్రేషన్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గజ్వేల్ మండలం టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా నడిగప్పుల నాగరాజు

Select Suryaa Now
గజ్వేల్ మండలం టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా  నడిగప్పుల నాగరాజు

గజ్వేల్ మండలం టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా  నడిగప్పుల నాగరాజు
ఉపాధ్యక్షునిగా కాసముల్ల శ్రీనివాస్.

ప్రజా సంక్షేమం ద్వేయంగా ప్రజలకి అందుబాటులో సర్పంచ్ లు పని చేయాలి.

గజ్వెల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి.

.గజ్వేల్ ; గజ్వెల్ మండలం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడిగా రంగంపేట్ గ్రామానికి చెందిన నడిగోప్పుల నాగరాజును
అదేవిధంగా ఫోరమ్ ఉపాధ్యక్షుడిగా ధర్మారెడ్డి పల్లి గ్రామానికి చెందిన కాసామొల్ల శ్రీనివాస్‌ను   సర్పంచ్ లు అందరు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా గజ్వెల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ వారికి శాలువాతో సత్కారించి శుభాకాంక్షలు తెలిపారు.
వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని అన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని నూతనంగా ఎన్నికైన ఫోరమ్ నాయకులకు వారు సూచించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధి, రైతులు, పేదలు, మహిళల సంక్షేమానికి రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, పల్లె ప్రగతి, గ్రామాగ్రామానికి వైకుంఠ దామాలు, చెత్త సేకరణ, డంప్ యార్డు లు దేశంలోనే ఇతర రాష్ట్రలకు ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రన్నీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలిపారని గుర్తు చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారం, రైతులకు నాణ్యమైన విద్యుత్, సంక్షేమ పథకాల అమలుపై  420హామీలు ప్రజల్లో ఒక నైరాష్యం ఉందని అన్నారు.ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ సర్పంచ్‌ల ఫోరమ్ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల సమస్యలను ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలనీ  సర్పంచ్ లకు తెలిపారు.గ్రామీణ ప్రజల గొంతుకగా ఫోరమ్ పనిచేయాలని కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి మంచి పెరు వచ్చేలా కృషి చేయాలనీ వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి వెంట ఆయా గ్రామాల సర్పంచ్లు అహ్మదిపూర్ బ్యాగారి ప్రభాకర్,కోలుగురు జ్యోతి స్వామి, గిరిపల్లి పిట్ల లావణ్య రమేష్, మాక్త మాసన్ పల్లి ఫహీమ్, షేరిపల్లి మమత శ్రీనివాస్ రెడ్డి,శ్రీగిరిపల్లి కల్పన బాలస్వామి, బూర్గుపల్లి చెలిమేటి వెంకట లక్ష్మి,బంగ్లా వెంకటాపూర్ నాగమణి నర్సింలు, 
నాయకులు రమేష్ గౌడ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.