రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికీ గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య : ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరు -ముంబై జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు.నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం, నేదురుమల్లి గ్రామానికి చెందిన తలపనేని రమేష్, శివూరి బాలకృష్ణ, వేమన గోపి ముగ్గురు వ్యక్తులు తమ బంధువులకు ఆత్మకూరు పట్టణంలోని ఆసుపత్రిలో ప్రసవం కావడంతో వారిని పరామర్శించి, అనంతరం ద్విచక్ర వాహనంపై తమ స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు, వారు ఆత్మకూరు పట్టణం వైపు నుండి జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో ఉన్న సమయంలో, నెల్లూరు వైపు నుండి బళ్లారి వైపు వెళ్తున్న కే ఏ -34-సి -9585 నంబరు గల లారీ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. సంఘటన సమాచారం అండగానే స్థానిక సి ఐ గంగాధర్, ఎస్ ఐ జంపాని కుమార్ హుటాహుటిన అక్కడకు చేరుకొని పరిశీలించి ప్రాథమిక విచారణ జరిపారు.సదరు లారీని పుడుముల ఎర్రిస్వామి, శాంతిప్రియ హాస్పిటల్ ఎదురుగా, కర్నూలు రోడ్, గుత్తి టౌన్, అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి నడుపుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించబడింది.
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలు కావడంతో, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే గాయాల తీవ్రత కారణంగా శివూరి బాలకృష్ణ మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలిసింది.
ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వాహనాన్ని, ఘటన స్థల పరిస్థితులను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సదరు విషయంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.