BREAKING
కొండేపి అభివృద్ధికి జోడు అడుగులు డోల బాల వీరాంజనేయ స్వామి దామచర్ల సత్య హెచ్-1బీ వ్యవస్థలో భారీ మోసాలు జరుగుతున్నాయి.. జలజీవన్ మిషన్ 90 లక్షల నిధులతో త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన.......... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గంగమ్మ ఒడికి చేరిన అతి భారీ ఏకదంత వినాయకుడు తంబళ్లపల్లె సీనియర్ సిటిజన్స్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం మిట్స్‌ వర్సిటీలో ఘనంగా భారత వైమానిక దళ దినోత్సవం రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికీ గాయాలు ఈనెల 12 నుండి బోయకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు టమోటా మార్కెట్ అభివృద్ధిలో కీలక సంస్కరణలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధత గ్యార్మీ మహోత్సవం(జెండా పండుగ) కార్యక్రమంలో పాల్గొన్న....... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గుజరాత్‌లో సబర్మతి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం తుది దశకు: 85 శాతానికి పైగా పనులు పూర్తి. మునగ ప్లాంటేషన్ పనులను పరిశీలించిన జెడ్పీ సీఈఓ బిసి సంక్షేమ గురుకుల పాఠశాలకు ఐదు సీలింగ్ ఫ్యాన్లు వితరణ పరిహారం ఇవ్వకుండా పనులెలా చేస్తారు?

తంబళ్లపల్లె సీనియర్ సిటిజన్స్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

Select Suryaa Now
తంబళ్లపల్లె సీనియర్ సిటిజన్స్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం


- ఎన్నికల అధికారిగా డాక్టర్ మునిగోపాలకృష్ణ వెల్లడి
మదనపల్లె : తంబళ్లపల్లి సీనియర్ సిటిజన్స్ నూతన కమిటీ ఏకగ్రీవమైంది.స్థానిక ఎంపీడీవో సమావేశ మందిరంలో గురువారం ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి.ఎన్నికల అధికారిగా డాక్టర్ మునిగోపాలకృష్ణ,అబ్జర్వర్ గా తిమ్మయ్య,సహాయకులుగా రామచంద్రయ్య ఎన్నికలు నిర్వహించారు.ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించబడ్డాయి.అధ్యక్షులుగా మాజీ జెడ్పిటిసి ఎం.రామచంద్ర,కార్యదర్శిగా శేఖర్ రెడ్డి సాహెబ్,ట్రెజరరుగా జి.గంగుల్ రెడ్డి,వైస్ ప్రెసిడెంటుగా బి.నారాయణ నాయుడు,జాయింట్ సెక్రటరీగా బాలకృష్ణారెడ్డి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా ఏటి కృష్ణప్ప,టీ.నరసప్ప నాయుడు,ఎం.కృష్ణారెడ్డి,కే.పార్వతమ్మ,డేరంగుల చిన్న పాపమ్మ ఎన్నికయ్యారు.ఎలక్షన్ ఆఫీసర్ డాక్టర్ మునిగోపాల కృష్ణ మాట్లాడుతూ ప్రతి నెల సమావేశం నిర్వహించాలని,మూడు నెలలకు ఒక పర్యాయము జిల్లాస్థాయి సమావేశాలకు అధ్యక్ష,కార్యదర్శులు హాజరు కావాలన్నారు.అదేవిధంగా సభ్యుల సంఖ్యను పెంచి సీనియర్ సిటిజన్లకు మరిన్ని సేవలు అందించాలని కోరారు. అనంతరం పరిశీలికులు‌ తిమ్మయ్య మాట్లాడుతూ సీనియర్ సిటిఎంసు ఐకమత్యంగా సమస్యలు ఎదురైనప్పుడు మాకు తెలియపరిస్తే మేము వచ్చి సామరస్యంగా పరిష్కరిస్తామని తెలియజేశారు.సహాయకులు రామచంద్రయ్య వయోవృద్ధులకు భగవద్గీత సారాంశాన్ని ముచ్చటగా మూడు వాఖ్యలతో వివరించారు.

కె. ఈశ్వర్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి