BREAKING
విదేశీ ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం: మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం* ఎన్నికల సామగ్రి అప్పగించే వరకు పోలింగ్ విధులు కొనసాగాల్సిందే: గుజరాత్ ఎన్నికల సంఘం స్పష్టీకరణ! పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలు: జూన్ ఆటో అమ్మకాల్లో జోరు: టీవీఎస్ సేల్స్ 47 శాతం, బజాజ్ ఆటో 28 శాతం జంప్.. అంచనాలను మించిన వృద్ధి! అమెరికాకు అసాధారణ ప్రతిభావంతులు మాత్రమే కావాలి: నేటి రాశి ఫలాలు: 9 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 9 అక్టోబర్ 2026 శుక్రవారం పిఆర్టియు నారాయణపేట మండల అధ్యక్షులుగా మొల్గాన్ జనార్ధన్ 5 వ వార్డులో తడి పొడి కి చెత్త బుట్టలు పంపిణీ జర్నలిస్టులు నిజాయితీగా వార్తలు రాయాలి.. తప్పుడు కథనాలు రాస్తే శిక్షార్హులు.. పోలీసులు, మీడియా సమన్వయంతో పనిచేయాలి : ఎస్పీ వినీత్ సాకి చెరువు కట్టపై బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సినిమాకు భారీ నష్టం.. ఏకంగా రూ.1,350 కోట్లు గల్లంతు! ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం*

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన

Select Suryaa Now
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన

చింతలపూడి, మేజర్ న్యూస్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చింతలపూడి మండలంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి పోలీసులు ముందస్తు పరిశీలన చేపట్టారు.ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని ప్రగడవరం, తిమ్మిరెడ్డిపల్లి, ఎర్రంపల్లి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేయనున్న పాఠశాలలను ఎస్సై సతీష్ కుమార్ తన సిబ్బందితో కలిసి సందర్శించి పరిశీలించారు.పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలు, వాహనాల రాకపోకలు, ఇతర మౌలిక సదుపాయాలపై పోలీసు అధికారులు పరిశీలన చేశారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పరిశీలన చేపట్టినట్లు తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని విధాలా సన్నద్ధమవుతున్నట్లు ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు.

 జిల్లా ఇంచార్జ్ పసుమర్తి రాము ఏలూరు