BREAKING
మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం* ఎన్నికల సామగ్రి అప్పగించే వరకు పోలింగ్ విధులు కొనసాగాల్సిందే: గుజరాత్ ఎన్నికల సంఘం స్పష్టీకరణ! పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలు: జూన్ ఆటో అమ్మకాల్లో జోరు: టీవీఎస్ సేల్స్ 47 శాతం, బజాజ్ ఆటో 28 శాతం జంప్.. అంచనాలను మించిన వృద్ధి! అమెరికాకు అసాధారణ ప్రతిభావంతులు మాత్రమే కావాలి: నేటి రాశి ఫలాలు: 9 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 9 అక్టోబర్ 2026 శుక్రవారం పిఆర్టియు నారాయణపేట మండల అధ్యక్షులుగా మొల్గాన్ జనార్ధన్ 5 వ వార్డులో తడి పొడి కి చెత్త బుట్టలు పంపిణీ జర్నలిస్టులు నిజాయితీగా వార్తలు రాయాలి.. తప్పుడు కథనాలు రాస్తే శిక్షార్హులు.. పోలీసులు, మీడియా సమన్వయంతో పనిచేయాలి : ఎస్పీ వినీత్ సాకి చెరువు కట్టపై బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సినిమాకు భారీ నష్టం.. ఏకంగా రూ.1,350 కోట్లు గల్లంతు! ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం* కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడం శోచనీయం

జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి..

Select Suryaa Now
జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి..

.అమలాపురం మేజర్ న్యూస్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 316బి, 2026–27 సంవత్సరానికి జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతిని నియమించారు. జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పీఎంఎఫ్‌జే ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు.జిల్లా అభివృద్ధికి, లయనిజం ద్వారా మానవతా సేవలకు సుదా గణపతి అందిస్తున్న సేవలను పరిగణనలోకి తీసుకుని ఈ బాధ్యతలు అప్పగించినట్లు జిల్లా గవర్నర్ తెలిపారు. జిల్లా క్యాబినెట్‌లో బాధ్యతాయుతమైన సభ్యునిగా పనిచేస్తూ లయనిజం లక్ష్యాలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

జిల్లా 316బి లక్ష్యాల సాధనలో భాగంగా క్యాబినెట్ సమావేశాలు, ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరై చర్చల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. హాజరు కాలేని పరిస్థితుల్లో ముందస్తు సమాచారం ఇవ్వాలని, కనీసం ఒక సర్క్యులర్‌ను విడుదల చేసి, తన పోర్ట్‌ఫోలియోకు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు.

అలాగే లయన్స్ సంస్థలో చేరే కొత్త సభ్యులు నాణ్యతతో కూడిన సేవా దృక్పథం కలిగిన వారై ఉండేలా చూడాలని, క్యాబినెట్ సమావేశాల్లో జరిగిన చర్చలు, నిర్ణయాలను క్లబ్ సభ్యులకు వివరించి వాటిని అమలు చేసేలా మార్గనిర్దేశం చేయాలని సూచించారు.సుదా గణపతి నియామకం పట్ల లయన్స్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన సేవల ద్వారా జిల్లా 316బి మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.