BREAKING
విదేశీ ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం: మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం* ఎన్నికల సామగ్రి అప్పగించే వరకు పోలింగ్ విధులు కొనసాగాల్సిందే: గుజరాత్ ఎన్నికల సంఘం స్పష్టీకరణ! పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలు: జూన్ ఆటో అమ్మకాల్లో జోరు: టీవీఎస్ సేల్స్ 47 శాతం, బజాజ్ ఆటో 28 శాతం జంప్.. అంచనాలను మించిన వృద్ధి! అమెరికాకు అసాధారణ ప్రతిభావంతులు మాత్రమే కావాలి: నేటి రాశి ఫలాలు: 9 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 9 అక్టోబర్ 2026 శుక్రవారం పిఆర్టియు నారాయణపేట మండల అధ్యక్షులుగా మొల్గాన్ జనార్ధన్ 5 వ వార్డులో తడి పొడి కి చెత్త బుట్టలు పంపిణీ జర్నలిస్టులు నిజాయితీగా వార్తలు రాయాలి.. తప్పుడు కథనాలు రాస్తే శిక్షార్హులు.. పోలీసులు, మీడియా సమన్వయంతో పనిచేయాలి : ఎస్పీ వినీత్ సాకి చెరువు కట్టపై బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సినిమాకు భారీ నష్టం.. ఏకంగా రూ.1,350 కోట్లు గల్లంతు! ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం*

సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం..

Select Suryaa Now
సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో  ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం..

 

భారత దేశ కీర్తి ని ప్రపంచం నలుమూలలకు చాటిన మహర్షి మోడీ --ఎమ్. పి. ఈటల.


హైదరాబాద్ /ఆల్వాల్, మేజర్ న్యూస్ :భారతదేశ కీర్తి పతాకను, కీర్తిని ప్రపంచం నలుదిశ ల చాటిన మహర్షి నరేంద్రమోడీ అని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల  రాజేందర్ అన్నారు. బుధవారం ఆల్వాల్ కానాజీగూడా శోభా గార్డెన్ లో మేడ్చల్ -మల్కాజ్గిరి అర్బన్ జిల్లా బిజెపి అధ్యక్షులు గిరివర్ధ రెడ్డి ఆధ్వర్యంలోనిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం లో  సేవజ్యోతి కార్యక్రమం లో ముఖ్య అతిధిగాఎమ్. పి. ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్రమోడీ సెప్టెంబర్ 7,2001 లో ప్రారంభించిన రాజకీయప్రస్థానం నేటివరకు అప్రతిహతంగా కొనసాగుతున్నదంటే మోడీ కి  ప్రజా సేవ పట్ల ఆయనకు ఉన్న అంకితభావం, దేశ శ్రేయస్సుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు, విదేశీవిధానం లో దీటైనా రాజ నితిజ్ఞత, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయనను ప్రపంచం దేశాలు సహితం పొగడే ల చేశాయి. .ఒక సి.ఎమ్. గా దేశ ప్రధానిగా 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక సంస్కరణలు, సహసోపేత నిర్ణయాలు, ప్రతిపక్షాల ఎత్తుగడలను, దయాది, పక్కదేశాలనుండి ఎదురయ్యే సవాల్ల ను ఎదుర్కొంటూ దేశాభివృద్ధి కుంటుపడకుండా ముందుకు సాగుతున్న నేత ని కితాబునిచ్చారు.ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న "సేవా సంకల్ప్ అభియాన్" కార్యక్రమంలో భాగంగా.. అల్వాల్ డైరీ ఫామ్ రోడ్డులోని శోభా గార్డెన్స్‌నుండి బిజెపి మేడ్చల్ మల్కాజిగిరి (అర్బన్) జిల్లా అధ్యక్షులు శ్రీ డి. గిరివర్ధన్ రెడ్డి  ఆధ్వర్యంలో "సేవా జ్యోతి కలశ యాత్ర"ను నిర్వహిస్తున్నందుకు అభినందించారు. ​శోభా గార్డెన్స్‌ లో మోదీ గారి ప్రసంగం అనంతరం.. శోభా గార్డెన్స్ నుండి శివాజీ చౌక్, కానజిగూడ పెట్రోల్ బంక్ వరకు ఈ కలశ యాత్ర కొనసాగింది.కార్యక్రమం లో ముందుగా గిరి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధానిగా మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చెపట్టిన కార్యక్రమాలు,  మోడీ నాయకత్వం లో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తీరు ను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఈ నెలరోజులు అక్టోబర్ 17 వరకు  వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వ్యాప్తముగా బిజెపి నాయకులకీ పిలుపునిచ్చారు. మోడీ సేవ ను ప్రజల్లోకి ప్రతి ఇంటి గుమ్మం వరకు చేర్చాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి , ఉప్పల్ మాజీ శాసనసభ్యులు  ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్సీ  కాటేపల్లి జనార్దన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి  గాండే సుధాకర్ , బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. మేకల శిల్ప రెడ్డి, బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు  రవి నాయక్ , రాష్ట్ర అధికార ప్రతినిధి  తాడూరి శ్రీనివాస్ , మాజీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్. మల్లారెడ్డి , బీజేపీ సీనియర్ నాయకులు వడేపల్లి రాజేశ్వర్ రావు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్కే శ్రీనివాస్ ,  గురుదే కృష్ణ ,  చింతల మాణిక్ రెడ్డి ,  గోపు రమణారెడ్డి ,  బ్రహ్మచారి , శ్రీమతి మాధవి ,  యం.ఎస్ వాసు ,  తిరుపతి యాదవ్ , జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి ధనలక్ష్మి , జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు జేకే శేఖర్ యాదవ్ , జిల్లా యువ మోర్చా అధ్యక్షులు  శ్రీనాథ్ , జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు శ్రీ మల్లేష్ యాదవ్ , జిల్లా ఎస్పీ మోర్చా అధ్యక్షులు  సుధాకర్ , జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు  వెంకటేష్ నాయక్ , రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీమతి అరకల సుధా , మాజీ కార్పొరేటర్లు శ్రీమతి బండారు శ్రావణి ,  ఊరపల్లి శ్రావణ్ కుమార్ , శ్రీమతి క్యానం రాజ్యలక్ష్మి , శ్రీమతి గున్నాల సునీత శేఖర్ యాదవ్ ,  మహేందర్ ,  రావుల శేషగిరి రావు , శ్రీమతి విజయలక్ష్మి సుబ్బారావు , సీనియర్ నాయకులు  దేవసాని బాలచందర్ ,  ఉడుత నవీన్ ,  జి బాలచందర్ గౌడ్ ,  జీ రమేష్ , పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.