జిల్లా మెడికల్ అధికారిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి*
*
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ Dr ఆనంద్ గారిని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ వైద్య సేవలు, ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాలు, ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక వసతులు, ప్రజారోగ్య సమస్యలపై చర్చించారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు కోరారు. నియోజకవర్గంలో వైద్య రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయంతో పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.