కాటారంలో కదం తొక్కిన కాషాయ దళం
ఘనంగా మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థాన వేడుకలు
150 బైక్‌లతో భారీ ప్రదర్శన..
హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా నారాయణరెడ్డి
కాటారం ప్రతినిధి,
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం కాటారంలో బీజేపీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించాయి. సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల (కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల) పరిధిలోని జిల్లా, మండల, గ్రామ స్థాయి వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా నారాయణరెడ్డి నివాసంలో ‘సేవా జ్యోతి సంకల్ప సభ’ నిర్వహించారు.ఈ సందర్భంగా సభలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ తెరల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసాన్ని కార్యకర్తలతో కలిసి వీక్షించారు. అనంతరం నేతలు ‘సేవా జ్యోతి’ని వెలిగించి, 150 బైక్‌లతో చేపట్టిన భారీ ప్రదర్శనను చల్లా నారాయణరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కాటారం మండల కేంద్రంలో కోలాహలంగా సాగింది. అనంతరం వివిధ పార్టీల నుంచి వచ్చిన పలువురు మహిళలు, సీనియర్ నాయకులకు చల్లా నారాయణరెడ్డి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా చల్లా నారాయణరెడ్డి మాట్లాడుతూ.. సామాన్య చాయ్‌వాలా నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోదీ ప్రస్థానం ప్రతి కార్యకర్తకూ ఆదర్శనీయమని కొనియాడారు. దేశ ప్రజలకు సేవ చేయడమే ప్రథమ కర్తవ్యంగా, ‘సబ్కా సాత్-సబ్కా వికాస్-సబ్కా విశ్వాస్’ లక్ష్యంతో 2047 నాటికి ‘వికసిత్ భారత్’ నిర్మాణమే ధ్యేయంగా ఆయన పాలన సాగుతోందన్నారు. గుజరాత్ తర్వాత ఐదుగురు రాష్ట్ర ఇన్‌చార్జీలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని గుర్తుచేశారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలు, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. మంథని నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా, మోదీ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలు చేయాలని, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాగె రంజిత్ కుమార్, మేడిపల్లి పూర్ణచందర్, బండ శ్రీకాంత్ పటేల్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎండీ రఫీ, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం తిరుపతి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు బొమ్మన భాస్కర్ రెడ్డి, మహిళా నేతలు బిసుల నిర్మల, లక్ష్మి, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శులు పసుల శివ, డోలి అర్జయ్య, జనగామ పోచయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు గంట అంకయ్య, మాజీ మండల అధ్యక్షుడు బండం మల్లారెడ్డి , మండల ప్రధాన కార్యదర్శి గోగుల రాజేష్, ఉపాధ్యక్షులు చిర్ల అశోక్ రెడ్డి, ఐలయ్య, శ్రవణ్, ప్రశాంత్, నవీన్, సడువలిరావు, ఎస్కే నిషాన్, ఎస్కే వస్తాద్, గంగాధరి సమ్మయ్య, మహేందర్ రెడ్డి, చల్లా రాజేశం, వివిధ మోర్చాల అధ్యక్షులు సో్నెపల్లి సాయిరెడ్డి, జాడి లక్ష్మణ్, కేతిరి రాజయ్య, గండు తిరుపతి, రాజు నాయక్, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు...