BREAKING
విదేశీ ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం: మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం* ఎన్నికల సామగ్రి అప్పగించే వరకు పోలింగ్ విధులు కొనసాగాల్సిందే: గుజరాత్ ఎన్నికల సంఘం స్పష్టీకరణ! పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలు: జూన్ ఆటో అమ్మకాల్లో జోరు: టీవీఎస్ సేల్స్ 47 శాతం, బజాజ్ ఆటో 28 శాతం జంప్.. అంచనాలను మించిన వృద్ధి! అమెరికాకు అసాధారణ ప్రతిభావంతులు మాత్రమే కావాలి: నేటి రాశి ఫలాలు: 9 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 9 అక్టోబర్ 2026 శుక్రవారం పిఆర్టియు నారాయణపేట మండల అధ్యక్షులుగా మొల్గాన్ జనార్ధన్ 5 వ వార్డులో తడి పొడి కి చెత్త బుట్టలు పంపిణీ జర్నలిస్టులు నిజాయితీగా వార్తలు రాయాలి.. తప్పుడు కథనాలు రాస్తే శిక్షార్హులు.. పోలీసులు, మీడియా సమన్వయంతో పనిచేయాలి : ఎస్పీ వినీత్ సాకి చెరువు కట్టపై బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సినిమాకు భారీ నష్టం.. ఏకంగా రూ.1,350 కోట్లు గల్లంతు! ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం*

వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు*

Select Suryaa Now
వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు*

 ఏలూరు మేజర్ న్యూస్: స్థానిక కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నా శిబిరాన్ని సందర్శించిన ఏపీ ఎన్జీవోస్ నాయకులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని విభాగాల్లో కాంట్రాక్టు వ్యవస్థ లో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్,లాబ్ టెక్నీషియన్ లు ఫార్మాసిస్ట్ లు,వివిధ విభాగాల్లో టెక్నిషన్స్ గా కాంట్రాక్టు పద్ధతి లో పని చేస్తున్న వారికి 100% సాలరీ ఇవ్వాలని.హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని సర్వీసు క్రమబద్ధీకరణ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మద్దతుగా ఏపీ ఎన్జీజిఓస్ అసోసియేషన్ పక్షాన ఏపీ జె ఏ సి పక్షాన మద్దతు తెలిపిన ఏలూరు జిల్లా జె ఏ సి చైర్మన్,జిల్లా ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్,కార్యదర్శి నెరుసు రామారావు,రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ ఎస్ హరనాధ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళు గా డి ఎస్ సి ద్వారా నియామకాలు జరిగిన మీ వెనక ఏపీ జె ఏ సి చైర్మన్ కామ్రేడ్ అలపర్తి విద్యా సాగర్ వారి ఆధ్వర్యంలో ఒక బలమైన నాయకత్వం ఉందన్నారు.ఏపీ ఎన్జీజిఓస్ అసోసియేషన్ సాగర్ వారి దృష్టిలో పెట్టిందని,ఆయన సానుకూలంగా మీ సమస్యలు పట్ల ఉన్నారన్నారు.ప్రభుత్వం వెంటనే వీరిని చర్చలకి పిలిచి సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ కోరారు.డిమాండ్స్ ను నెరవేర్చని పక్షాన ఐక్య ఉద్యమంతో ముందుకు వెళ్ళాలని,ఉద్యమం తీవ్ర తరం చేయాలంటే ప్రభుత్వం దృష్టిలో మీ సమస్యలను పట్టించుకోవాలంటే కుటుంబ సభ్యులతో ఈ ధర్నా లో పాల్గొని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి డిమాండ్స్ ను నెరవేర్చుకోవాలన్నారు.ఈ సందర్భంలోనే నెరుసు రామారావు మాట్లాడుతూ ఎటువంటి ఒత్తిడి వచ్చినా ఉద్యమ స్పూర్తితో ముందుకు సాగాలని,మీరు చేసే ఈ పోరాటం ఆపడానికి వైద్యాధికారులు ప్రయత్నం చేస్తే ఏపీ ఎన్జీవో సంఘం దృష్టికి తీసుకొనిరావలని,కొంతమంది ఉద్యమాన్ని నీరు గార్చాలని చూస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండి ఉద్యమ స్పూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ మెడికల్ ఉద్యోగులు,ఆంధ్రప్రదేశ్ ఫార్మాసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.మహిధారాచార్యులు.ఏపి ఎన్ జి జీ వో అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ జి.నాగమణి వారి స్టాఫ్ నర్సెస్ వారి సహచరులు పాల్గొని మద్దతు పలికారు.మెడికల్ కాంట్రాక్టు ఉద్యోగుల జె ఏ సి నాయకులు సులోచన,ఆనంద్ ఇతర నాయకులు.మా న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వ దృష్టికి రాష్ట్ర నాయకులు సాగర్ వారి ద్వారా న్యాయం జరిగేలా చూడాలని కోరారు.ఈ ధర్నా కి మద్దతు తెలిపిన ఏలూరు జిల్లా ఎన్ జి వో స్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.