ఇసుక బకాసురులకు అండగా నిలుస్తున్న అధికారులు
ఇసుక బకాసురులకు అండగా నిలుస్తున్న అధికారులు..
విచ్చలవిడిగా ఇసుక దంద ..
సిపిఐ ఎం ఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లిమల్లేష్....
టేకుమట్ల ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని చలి వాగు, మానేరు వాగు పరివాహక ప్రాంతంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ ఇసుక బకాసురులు అందినంత దండుకుంటున్నారని అట్టి వ్యక్తులకు ఆయా మండలాల్లోని సంబంధిత అధికారులు అండగా ఉంటున్నారని సిపిఐ ఎం ఎల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
అన్నారు.
టేకుమట్ల చిట్యాల మొగుళ్లపల్లి ఈ మూడు మండలాల్లో చలి వాగు, మానేరు వాగు గ్రామాల్లో ఉన్నటువంటి ఇసుకను విపరీతంగా ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అసలే ఎండాకాలం కొట్టినట్టుగా ఎండలు కొడుతున్నాయి వర్షాలు లేవు ఆ చలి వాగులు నమ్ముకుని ఈ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు వరి పొలాలువేసినారు పంట చేతికి వస్తుందో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు విచ్చలవిడిగా ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది తక్షణమే అక్రమ ఇసుక దందాను అరికట్టి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ అధికారులను జిల్లా కలెక్టర్ ని కోరుచున్నామని, ఇసుక తీసుకెళ్తున్న వెహికల్స్ కు ఇన్సూరెన్స్ కాగితాలు డ్రైవర్ కు లైసెన్స్ ఇలాంటివి ఏమీ ఉండటం లేదు ఏదైనా ప్రమాదం జరిగిన దిక్కు లేదని వీరి నిర్లక్ష్యం పట్లప్రభుత్వ అధికారులు స్పందించిన దాఖలు కనబడడం లేదని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని,గ్రామ పంచాయతీల సర్పంచులు గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం అని వెహికల్స్ యజమాన్యం దగ్గర ట్రిప్పుకు 200 తీసుకొని ఇసుక అక్రమార్కులకు సహకరిస్తున్నారు తక్షణమే స్పందించకపోతే ఆందోళన తప్పదని మారేపల్లి మల్లేష్ హెచ్చరించారు.