BREAKING
జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి.. రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర… రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన పీఏసీఎస్‌ల సమస్యల పరిష్కారానికి చర్యలు పులి పాదముద్రల గుర్తింపు బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ దృశ్యం 3 మేనియా.. ఆరో రోజు కూడా తగ్గని జోరుతో రూ. 230 కోట్ల కలెక్షన్లు! 25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రామ్‌చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్.. దసరాకు పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఎప్పుడంటే? వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం.. వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు* పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు.

9న జరిగే జాబ్ మేళాను విజయవంతం చేయాలి

Select Suryaa Now
9న జరిగే జాబ్ మేళాను విజయవంతం చేయాలి


-- పుష్ప గార్డెన్ లో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీ.

భూపాలపల్లి సూర్యప్రతినిధి,

నిరుద్యోగ యువతకు  ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 9న భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గార్డెన్స్‌లో మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.9వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్ మేళా నిర్వహణపై బుధవారం పుష్ప గ్రాండ్ నందు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి సిరిశెట్టి సంకీర్త్ తో కలిసి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.  ముందుగా ఏర్పాట్లును పరిశీలించి అధికారులకు టెంట్లు, సౌండ్ సిస్టం ఏర్పాటు, భోజన సౌకర్యాలు తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొననున్నాయని పేర్కొన్నారు. వివిధ విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రవాణా, రిజిస్ట్రేషన్ కౌంటర్లు, భోజనం, టిఫిన్, టాస్క్ ప్రతినిధుల వసతి తదితర ఏర్పాట్లను సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జాబ్ మేళాను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అభ్యర్థుల సౌకర్యార్థం మొత్తం 15 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని 8 మండలాలకు 8 కౌంటర్లు, భూపాలపల్లి పట్టణానికి ఒక కౌంటర్‌తో పాటు 4–5 జనరల్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రతి కౌంటర్‌లో మండల విద్యాశాఖ అధికారులతో పాటు నలుగురు సిబ్బంది అందుబాటులో ఉంచాలని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ఆటోలు, టాటా ఏస్ వాహనాలను ఉచితంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సర్పంచులు, ఎంపిడిఓలు సమన్వయంతో ఉదయాన్నే టిఫిన్ అందించి వాహనాల ద్వారా అభ్యర్థులను జాబ్ మేళా ప్రాంగణానికి తరలించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్,ఎంటెక్, బీఫార్మసీ, డీఫార్మసీ తదితర విద్యార్హతలు కలిగిన యువత పాల్గొనవచ్చని తెలిపారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలతో ఉదయం 7 గంటలకు పుష్ప గార్డెన్స్‌కు చేరుకోవాలని ఆయన సూచించారు.గతంలో నిర్వహించిన జాబ్ మేళాలో సుమారు 2770  మందికి పైగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు. ఈసారి మరింత విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నందున యువత పెద్ద సంఖ్యలో యువత  పాల్గొనే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు  ఆయన తెలిపారు.విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా చేయాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి,జెన్కో సీఈ శ్రీ ప్రకాష్, సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.